అందరి ముందు ఏడ్చిన ఉత్తర కొరియా నియంత " కిమ్ "..!
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనూహ్యంగా భావోద్వేగానికి లోనయ్యారు. అది కూడా మొదటి సారి అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన నియంతగా పేరున్న కిమ్.. ఎమోషనల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికుల మృతి..
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగించడానికి, ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడారు. వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, వారి మృతదేహాలను రష్యా విమానాల్లో స్వదేశానికి తరలించారు.

ఈ మేరకు కుర్స్క్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించేటప్పుడు కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా బహిరంగంగా ఎప్పుడూ భావోద్వేగాలను ప్రదర్శించని కిమ్, ఈ సందర్భంలో తీవ్ర మానసిక ఆవేదనను వ్యక్తపరచడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఆయన సైనికుల ఫోటోలపై పతకం ఉంచుతూ మోకాళ్లపై కూర్చోని కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ఇతర సైనికులు కూడా దీన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
అంతే కాకుండా ఒక సందర్భంలో చనిపోయిన సైనికుడి కుమార్తెను కిమ్ నుదిటిపై ముద్దు పెట్టి ఓదార్చారు. ఆ తర్వాత సైనికులను కిమ్ జోంగ్ ఉన్ సత్కరించారు. కాగా షాంఘై ఐ (ShanghaiEye) అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆగస్టు 22, 2025న ఈ వీడియోను షేర్ చేసింది. సదరు వీడియోలో ఈ సంఘటనలు అన్నీంటిని గమనించవచ్చు.
🇰🇵🇷🇺🇺🇦#NorthKorean leader #KimJongUn led an emotional ceremony in #Pyongyang to honor soldiers killed fighting for #Russia in #Ukraine. pic.twitter.com/hX3h3ohWMt
— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 22, 2025












Click it and Unblock the Notifications