Kim Jong Un: వీడియో: బాగా బరువు తగ్గిన ఆధునిక నియంత: తాతను తలపించేలా

ప్యొంగ్యాంగ్: ఉత్తర కొరియా అనేగానే మొట్టమొదటిసారిగా అందరికీ గుర్తుకొచ్చేది.. ఆ దేశాధినేత కిమ్‌జొంగ్ ఉన్. చిన్న వయస్సులోనే దేశాధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తీసుకున్న నిర్ణయాలు.. అమలు చేసిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఆయనను ఆధునిక నియంతలా నిలబెట్టాయి. ఎడ్డం అంటె తెడ్డం అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఉత్తర కొరియాలో కిమ్‌జొంగ్ చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా..తాను అనుకున్నది చేసుకుంటూ పోతుంటారు. ఆధునిక నియంతగా ప్రపంచం మొత్తం ఆయనను అభివర్ణిస్తుంటుంది.

Recommended Video

    Kim Jong Un New Look After 20 kg Weight Loss || Oneindia Telugu

    అజ్ఙాతంలోకి..

    అజ్ఙాతంలోకి..

    ఆహార కొరత నెలకొన్నప్పటికీ.. అణ్వస్త్ర ప్రయోగాలను మాత్రం మానట్లేదాయన. గత ఏడాది కొన్ని రోజుల పాటు కిమ్‌జొంగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. రోజుల తరబడి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. బాహ్య ప్రపంచానికి దూరంగా గడిపారు. ఒకదశలో ఆయన మరణించారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆయన చెల్లెలు కిమ్ యోంగ్ జాంగ్ దేశాధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్నారనే వదంతులు వ్యాప్తి చెందాయి. ఆమె అనధికారికంగా ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియా అనేక కథనాలను ప్రచురించింది.. ప్రసారం చేసింది.

    తలకు బ్యాండేజీతో.. అప్పుడు

    తలకు బ్యాండేజీతో.. అప్పుడు

    కొన్ని నెలల తరువాత కిమ్‌జొంగ్ ఉన్ మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చారు. అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ప్లినరీలో ఆయన చురుగ్గా కనిపించారు. దీనితో ఆయన మీద వ్యక్తమైన అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. రెండు నెలలో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సమయంలో ఆయన తలకు బ్యాండేజీ కనిపించింది. మాజీ సైనికులతో నిర్వహించిన కీలక సమావేశంలోనూ ఆయన అదే స్థితిలో పాల్గొన్నారు. ఆయన తలకు తీవ్ర గాయమైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. వాటిని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.

    స్లిమ్‌గా ఇప్పుడు..

    ఇక తాజాగా కిమ్‌జొంగ్ ఉన్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ సారి ఆయన న్యూ లుక్‌తో కనిపించారు. ఇదివరకు భారీ పొట్టతో, అయాసపడుతూ ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. స్లిమ్‌గా తయారయ్యారు. చురుగ్గా కదులుతున్నారు. కొత్త హెయిర్ స్టైల్‌తో అదరగొట్టారు. ఆయన బాన కడుపు బాగా లోనికి వెళ్లినట్టు ఉంది. హెయిర్ స్టైల్‌ను మార్చారు. కొంత మెచ్యూర్డ్‌గా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారిపోయారు.

    స్మోక్ చేయడం తగ్గించారా?

    స్మోక్ చేయడం తగ్గించారా?

    తాజాగా- రాజధాని ప్యొంగ్యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ పరేడ్‌కు కిమ్‌జొంగ్ ఉన్ హాజరయ్యారు. గ్రే కలర్ సూట్‌లో మెరిసిపోయారు. కిమ్‌జొంగ్ చైన్ స్మోకర్. ఆయన చేతిలో ఎప్పుడూ సిగార్ ఉంటుంది. ఈ సారి సిగార్ కనిపించలేదు. స్మోక్ చేయడాన్ని తగ్గించినట్టేననే అభిప్రాయాలను విదేశీ మీడియా వ్యక్తం చేసింది. ఇదివరకట్లా బద్ధకంగా కాకుండా.. కిమ్ చురుగ్గా ఉంటోన్నారని పేర్కొన్నాయి. ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ తమ కథనాలను పబ్లిష్ చేశాయి.

     20 కేజీలు తగ్గారట..

    20 కేజీలు తగ్గారట..

    కిమ్‌జొంగ్ ఉన్ ఇదివరకు 140 కేజీల బరువు ఉండేవారని, ఇప్పుడు 120కి తగ్గారని విదేశీ మీడియా పేర్కొంది. సుమారు 20 కేజీల బరువు తగ్గారని తెలిపింది. వంద కేజీల లోపు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయపడింది. ఊబకాయం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తల్తెతుతోండటం వల్ల బరువు తగ్గాలని కిమ్‌జొంగ్ నిర్ణయించుకున్నారని, దానికి అనుగుణంగా ఆయన కొంత డైట్‌ను పాటిస్తున్నారని తెలిపింది. మున్ముందు- కిమ్‌జొంగ్ మరింత స్లిమ్ కావడానికి అవకాశాలు లేకపోలేదని విదేశీ మీడియా పేర్కొంది. తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ సంగ్‌-2ను తలపిస్తోన్నారని వ్యాఖ్యానించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+