అక్కడ బతకాలంటే లంచమివ్వాల్సిందే..!
జెనీవా : ఉత్తర కొరియాలో ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నియంతను తలపించే కిమ్ జాంగ్ ఉన్ పాలనలో జనం పడుతున్న గోస మాటల్లో వర్ణించలేం. అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. కనీసావసరాలు తీర్చుకునేందుకు దిక్కులేని పరిస్థితి. ఇలాంటి అధ్వాన్న స్థితిలో ప్రజలు ఉన్నా అక్కడి ప్రభుత్వం వారిని ఆదుకోకపోగా.. పుండుపై కారం చల్లినట్లు మరింత వేధిస్తుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నార్త్ కొరియాలో నెలకొన్న పరిస్థితులపై ఒక నివేదిక రిలీజ్ చేసింది. అందులో పలు సంచలన విషయాలు బయటపెట్టింది.

అవినీతి, అణచివేత
ఉత్తర కొరియా అవినీతితో నిండిపోయిందని, అణచివేత సాధారణమని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. శిక్షిస్తామని, జైల్లో పెడతామని బెదిరించి కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజల నుంచి కూడా అక్కడి అధికారులు దోపిడీ చేస్తారని చెప్పింది. ది ప్రైస్ ఈజ్ రైట్స్ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక పేదరికం, అవినీతి, అణచివేత వలలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడిపోతున్నారని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కొరియాలో 10మిలియన్ల మంది ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. దశాబ్దంలో అత్యంత దుర్బరమైన కరువు నేపథ్యంలో ప్రజలపై మరిన్ని ఆంక్షలు పెట్టే అవకాశముందని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేసింది.

అధికారులకు లంచాలు ఇవ్వాల్సిందే
1990లో ప్రజా పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో ఉత్తర కొరియా ప్రజల కష్టాలు తారాస్థాయికి చేరాయి. దేశ జనాభాల్లో నాల్గింట మూడొంతుల మంది బ్లాక్ మార్కెట్‌లో సరుకులు కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగి అయినా నెలలో కడుపు నిండా తినే పరిస్థితి లేదు. జీతం ఇవ్వకపోవడంతో జీవనోపాధి కోసం ఏదైనా పని చేయకతప్పని పరిస్థితి. అయితే అలా పని చేసుకున్నందుకు కూడా అధికారులకు లంచం చెల్లించాల్సిందేనని యూఎన్ రిపోర్టు చెబుతోంది. 214 మందిని ఇంటర్వ్యూ చేసి మానవ హక్కుల సంఘం ఈ నివేదిక రూపొందించిది.

నివేదికను ఖండించిన నార్త్ కొరియా
ప్రజలు పడుతున్న కష్టాల గురించి మానవ హక్కుల సంఘం రూపొందించిన నివేదికను నార్త్ కొరియా తోసిపుచ్చింది. రాజకీయంగా ప్రభావితమై ఈ రిపోర్టు తయారూచేశారని ఆరోపించింది. వారికి అవసరమైన నిధులు పొందేందుకు కొంత మంది ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఇలాంటి రిపోర్టులు తయారు చేస్తారని విమర్శించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications