Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ ట్రబుల్ లో పాకిస్థాన్.. చివరి హెచ్చరికలు జారీ..

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) మరోసారి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. 2022 లో పాకిస్థాన్ ను గ్రే లిస్టు నుంచి FATF తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పాకిస్థాన్.. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు FATF దృష్టికి వచ్చింది. ఈ ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఆయుధాల ప్రయోగం తదితర అంశాలపై FATF మరోసారి పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. గ్రే లిస్టు నుంచి తొలగించినంత మాత్రాన టెర్రరిస్టులను సాయం చేయాలని లైసెన్స్ ఇచ్చినట్లు కాదని మండిపడింది. ఉగ్రవాద సంస్థలకు మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ పై FATF ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్ పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) మండిపడింది. FATF అధ్యక్షులు ఎలిసా డి అండా మడ్రాజో పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ లాంటి దేశాలు చర్యలు తీసుకోవాలని అన్నారు." ఏ దేశం అయినా గ్రే లిస్టులో ఉన్నా లేకపోయినా మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ లాంటి చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేశారు. గ్రే లిస్టు నుంచి తొలగించినంత మాత్రాన ఉగ్రవాద కార్యకలాపాలకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదని తెలిపారు. పారిస్ లో జరిగిన సమావేశంలో FATF ఈ వ్యాఖ్యలు చేసింది. గ్రే లిస్టు నుంచి బయటకు వచ్చిన వాళ్లు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

2022, అక్టోబర్ లో పాకిస్థాన్ ను FATF సంస్థ గ్రే లిస్టు నుంచి తొలగించింది. ఆ తర్వాత ఫాలో అప్ కేటగిరీలో ఉంచింది. ఈ కేటరిగీలోని దేశాలను ఉగ్రసంస్థలకు మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ లాంటి చర్యలకు పాల్పడకుండా మానిటరింగ్ చేస్తున్నట్లు FATF అధ్యక్షులు ఎలిసా డి అండా మడ్రాజో ఇటీవల తెలిపారు. ఇక అంతర్జాతీయ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం పాకిస్థాన్ లో జెయిష్- ఈ - మహ్మద్(JeM) ఉగ్రవాద సంస్థ ఉంది. ఈ టెర్రరిస్టు గ్రూప్ నిధుల సమీకరణను ఆన్ లైన్ పేమెంట్స్ విధానంలో చేస్తున్నట్లు గుర్తించారు. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ కు ఈ నిధులను తరలిస్తున్నారు. ఇవి FATF దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేదంటే మరోసారి గ్రే లిస్టులోకి పంపించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

Not Bulletproof FATF Slaps Warning on Pakistan Post-Greylist Exit Over Terror Funding

ఇక పాకిస్థాన్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుందని భారత్ ఎప్పటినుంచో ఆధారాలతో సహా నిరూపిస్తూనే ఉంది. పాకిస్థాన్ ను 2018 లో గ్రే లిస్టులో చేర్చారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పాక్ తోపాటు ఇతర ప్రపంచ దేశాల ఒత్తిడితో 2022లో FATF పాకిస్థాన్ ను గ్రే లిస్టు నుంచి తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి ప్రపంచ దేశాలు పాకిస్థాన్ చర్యలను పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మెరుగుపడకపోతే మరోసారి పాకిస్థాన్ ను గ్రే లిస్టు లోకి పంపేందుకు చూస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+