భారత సంతతి మహిళ షాన పాండ్యా అంతరిక్షంలోకి వెళ్లడం లేదు
భారత సంతతికి చెందిన డాక్టర్ షాన పాండ్యా (32) అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన స్వయంగా పాండ్యా స్పందించారు.
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డాక్టర్ షాన పాండ్యా (32) అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని స్వయంగా పాండ్యా ఖండించారు. తాను కెనెడియన్ స్పేస్ ఏజెన్సీస్ లేదా నాసాతో అఫిలియేట్ అయి లేనని స్పష్టం చేశారు. తాను నాసా మిషన్‌కు ఎంపిక కాలేదని చెప్పారు.
కాగా, భారత సంతతికి చెందిన వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రలకు వెళ్లి భారత కీర్తిని ఇనుమడింపజేసిన విషయం తెలిసిందే. త్వరలో షానా పాండ్యా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ఆమె ఇప్పుడు ఖండించారు.
డాక్టర్ షాన పాండ్య (32) ప్రస్తుతం కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీ హస్పిటల్‌లో జనరల్ ఫిజిషియన్‌గా పని చేస్తున్నారు. సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ (సీఎస్‌ఏ) ప్రోగ్రాం కోసం 3,200 మంది నమోదు చేసుకోగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు.

ఆ ఇద్దరిలో పాండ్య ఒకరు అని వార్తలు వచ్చాయి. 2018లో ఎనిమిది మంది వ్యోమగాములతో కలిసి ఈమె కూడా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నట్లు వచ్చింది.
కాగా, ఇటీవలే పాండ్య.. ముంబై నగరంలోని సొంత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మిషన్‌లో భాగంగా బయో మెడిసిన్, మెడికల్ సైన్స్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
'పోలార్ సబ్‌ఆర్బిటల్ సైన్స్ ఇన్ ది అప్పర్ మెసోస్పియర్' ప్రాజెక్టులో భాగంగా వాతావారణ మార్పుల ప్రభావంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని పాండ్య వివరించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications