వాహ్..! ఈ సెల్ఫీ చూస్తే అద్బుతం అనాల్సిందే
న్యూయార్క్ : చేతిలో స్మార్ట్ ఫోన్ ఇప్పుడో కామన్ థింగ్. స్నేహితులు కలిసినప్పుడో, మంచి లొకేషన్ కు వెళ్లినప్పుడో.. ఓ సెల్ఫీ క్లిక్ మనిపించాల్సిందే. ఇదీ ఇప్పటి యువత ట్రెండ్. అయితే సెల్ఫీ అంటే.. ఏ అల్లాటప్పా వ్యవహారమో..! సరదా కోసమో అని భావించేవారు కొందరైతే, దానికో సృజన్మాతకను అద్ది 'టాక్ ఆఫ్ ది సెల్ఫీ' గా నిలిచేవాళ్లు మరికొందరు.
బ్రిటన్ కు చెందిన ఓ టూరిస్ట్ ఇలాగే వార్తల్లోకి ఎక్కాడు. అతడు తీసిన సెల్ఫీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా సెల్ఫీ అంటే.. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి 360 డిగ్రీ కోణంలో.. దట్టంగా కమ్ముకున్న మేఘాలను, అందమైన న్యూయార్క్ నగరాన్ని కవర్ చేస్తూ.. ఓ అధ్బుతమైన సెల్ఫీ దిగాడు.

అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఎక్కడ లేని క్రేజ్ వచ్చిపడింది. అలా.. బెస్ట్ సెల్ఫీ మ్యాన్ గా వార్తల్లోను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు సదరు బ్రిటన్ టూరిస్ట్. ఇంతవరకు చాలామంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై సెల్ఫీలు దిగినా.. ఇతనిలా ఇంత అద్బుతంగా సెల్ఫీ దిగినవాళ్లు లేరనే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications