వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను కత్తితో పొడిచిన భర్త: జైలు శిక్ష పడకుండా చేసిన హిందూ కల్చర్!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భార్యను కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ ప్రవాస భారతీయుడ్ని అతను ఆచరిస్తున్న హిందూ సంస్కృతి కాపాడింది. దీంతో అతడు అమెరికాలోని కాన్సాస్ ప్రాంతంలో పోలీసుల పరిశీలనలో ఉండాల్సి వచ్చింది.

హిందూ సాంప్రదాయం ప్రకారం అతను జైలుకు వెళితే.. అతని కుటుంబానికి ఏ ఆధారం లేకుండా అవుతుందని అతని తరపు అటార్నీ వాదించడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇవ్వడం గమనార్హం. సాంప్రదాయక విషయాలు తమ తీర్పుపై పెద్ద ప్రభావమే చూపుతున్నాయని డౌగ్లస్ కౌంటీ జిల్లా జడ్జి రాబర్ట్ ఫెయిర్‌చిల్డ్ తెలిపారు.

2015 జూన్‌లో నిందితుడు నవీన్ కుమార్(46) లారెన్స్‌లో తను నిర్వహించే సూపర్ 8 మోటెల్ ఎదుటే తన భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరింది. కాగా, రెండో డిగ్రీ హత్యా నేరం కింద పోలీసులు ఇతడిపై కేసు నమోదు చేశారు.

NRI stabs wife as she was overweight, escapes jail due to 'Hindu culture'

హిందూ కల్చర్ ఎలా కాపాడింది?

హిందూ సంస్కృతి ప్రకారం ఇతడు అరెస్టైయితే పటేల్ ఫ్యామిలీకి చెందిన వీరి కుటుంబం(భార్య, పిల్లలు) దిక్కులేని వారైపోతారని నిందితుడి తరపు న్యాయవాది జాన్ కెర్న్స్ న్యాయమూర్తికి విన్నవించారు. న్యాయవాది వాదనకు ఏకీభవించిన జడ్జి... ఇతన కేసులో సంస్కృతిది కీలక పాత్ర అని అన్నారు. నిందితుడ్ని జైల్లో పెట్టకుండా నెలరోజులపాటు పరిశీలనలో ఉండాలని ఆదేశించారు.

కాగా, జూన్ 24, 2015న కూర్చుని ఆహారం తీసుకుంటున్న తన భార్యను కత్తితో నవీన్ కుమార్ రెండుసార్లు పొడిచాడని పోలీసులు తెలిపారు. ఆమె లావుగా ఉన్న కారణంగానే కోపం పెంచుకున్న నవీన్.. ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. అయితే, నవీన్ కుమార్ మద్యానికి బానిసయ్యాడని, అతని మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండటం లేదని అతడ్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

అయితే, కొసమెరుపు ఏమిటంటే.. అతను కత్తితో దాడి చేసిన అతడి భార్య, ఇతర కుటుంబసభ్యులు నవీన్ కుమార్‌కు కోర్టులో మద్దతుగా నిలవడం విశేషం. అంతేగాక, అతడ్ని అరెస్ట్ చేయవద్దని వారు న్యాయమూర్తిని కోరారు. దీంతో అతడ్ని పరిశీలనలో ఉండాలని జడ్జి ఆదేశించారు. కేసును సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు.

English summary
An NRI was sentenced to probation in Kansas for trying to kill his wife with a pocketknife after his attorney argued that sending him to prison could cause the man's family to be ostracised as part of their Hindu culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X