అమెరికాలో కూతురిని కాల్చి చంపిన తెలుగు మహిళ

హత్య కోసం రివాల్వర్‌ను కొన్న సుజాత, ఈ విషయాన్ని ముందుగానే సోదరుడికి మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సుజాత సోదరుడు ఇంటికి వచ్చేలోగా ఘోరం జరిగిపోయింది. తీవ్రగాయాలతో ఉన్న సుజాతను ఆస్పత్రికి తరలించారు.
సుజాత తన కూతురిని చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. సంఘటన జరిగినప్పుడు సుజాత భర్త రావు గూడూరు అక్కడ లేరు. ఘటన పథకం ప్రకారమే జరిగినట్లు భావిస్తున్నారు.
సుజాత ఈ నెల 2వ తేదీన గన్ కొన్నట్లు, సంఘటన ఆకస్మికంగా జరిగింది కాదని, పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అంటున్నారు. సుజాత కోలుకున్న తర్వాత ఆమెను విచారిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications