నా టేబుల్‌పైనే న్యూక్లియన్ బటన్, నొక్కితే బుగ్గిపాలే: కిమ్ సంచలనం

ప్యాంగ్యాంగ్: కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆశలతో ప్రపంచం ముందుకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకొంటుంది. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మాత్రం ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేసే రీతిలో కొత్త సంవత్సర వేడుకల సందేశాన్ని ఇచ్చారు.తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంటుందని కిమ్ స్పష్టం చేశారు.

వరుస అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాలకు కొరకరాని కొయ్యగా మారాడు. కిమ్ జంగ్ ఉన్ ను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది.

పలు రకాల ఆంక్షలను ఇప్పటికే ఉత్తరకొరియాపై విధించారు. అంతేకాదు ప్రతి అవకాశాన్ని ఉత్తరకొరియాపై పై చేయి సాధించేందుకు అమెరికా ఉపయోగించుకొంటుంది.

నా టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్

నా టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్

నా టేబుల్‌పై ఎప్పుడూ ఒక బటన్‌ ఉంటుంది. నొక్కితే అంతా బుగ్గిపాలే. అది.. న్యూక్లియర్‌ వెపన్‌ అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచదేశాలకు హెచ్చరిక చేశారు కిమ్. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదని కిమ్ ఈ సందేశంలో తేల్చి చెప్పారు.

అణ్వస్త్రాల తయారీలో వేగం పెంచాలి

అణ్వస్త్రాల తయారీలో వేగం పెంచాలి

అణ్వస్త్రాల తయారీలో వేగాన్ని పెంచాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అభిప్రాయపడ్డారు.ఖండాంతర క్షిపణులను పెద్ద ఎత్తున మోహరింపజేయాలి. ప్రపంచంలోని ఏ శక్తీ కూడ ఉత్తరకొరియా జోలికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కింమ్‌ జంగ్‌ నూతన సంవత్సర సందేశంలో చెప్పారు.

ప్రపంచ దేశాలకు సవాలే

ప్రపంచ దేశాలకు సవాలే

ప్రపంచదేశాలకు కిమ్ జంగ్ ఉన్ సవాల్‌ను విసిరారు. కొత్త సంవత్సరంలో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండాలని కోరుకొంటున్న తరుణంలోనే హెచ్చరికలతోనే కొత్త సంవత్సరంలోకి కిమ్ కొత్త సంవత్సరంలోకి అడుగిడెలా చేశారు. ఇప్పటికే అణు పరీక్షలతో కిమ్ అమెరికాతో పాటు ఇతర దేశాలకు సవాల్‌ విసురుతున్నారు.

అమెరికా లక్ష్యంగా అణు కార్యక్రమాలు

అమెరికా లక్ష్యంగా అణు కార్యక్రమాలు

అమెరికా లక్ష్యంగా అణు కార్యక్రమాల నిర్వహణకు ఉత్తరకొరియా సమాయత్తమైంది. ఇప్పటికే అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచదేశాలకు చుక్కలు చూపించింది. అమెరికాకు ధీటుగా అణ్వాయుధాల తయారీలో ఉత్తరకొరియా ఉందని ఆ దేశ మీడియా ఇటీవల ప్రకటన చేసింది.రానున్న రోజుల్లో ఇంకా ఇదే తరహ అణ్వాయుధాల తయారీని కొనసాగించనున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచానికి సావల్ విసురుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+