Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nuclear Weapons: ఆసియాలో పెరుగుతున్న అణ్వాయుధాలు.. భారత్,పాక్,చైనాపై ట్రంప్ దృష్టి!

Nuclear Weapons: భారత్, పాక్, చైనా అణ్వాయుధాల గురించి అమెరికా చాలా ఆందోళనలో ఉంది. ఆసియాలో అణ్వాయుధ పోటీ తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. దీని కోసం ఆయన రష్యా, చైనాతో పాటు భారత్, పాకిస్థాన్ వంటి దేశాలతో చర్చలు జరపాలనుకుంటున్నారు. ట్రంప్ మరోసారి అణ్వాయుధాల తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కానీ ట్రంప్ ఉద్దేశం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాలు ఆయుధాలను తగ్గించుకోనప్పుడు చైనా, భారత్, పాకిస్థాన్ నుంచి దీనిని ఆశించడం వ్యర్థమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అమెరికా ఎందుకు ఇంత ఆందోళన చెందుతుందో తెలుసుకుందాం?

ట్రంప్ కు భారత్-పాకిస్థాన్-చైనాలపై అనుమానం?
భారత్-పాకిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాలలో అణ్వాయుధాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అదే సమయంలో, మూడు అణుశక్తి కలిగిన దేశాలలో ఒకటైన చైనా తన అణుశక్తిని వేగంగా పెంచుకుంటోంది. దీనిపై ఆందోళన చెందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అణ్వాయుధాలను తగ్గించడంపై రష్యా, చైనాలతో మళ్ళీ చర్చలు ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్, భారతదేశంతో సహా ఇతర దేశాలు కూడా ఈ పథకంలో చేర్చబడతాయని ఆయన ఆశిస్తున్నారు.

చైనా తనను అధిగమిస్తుందని భయపడుతున్న అగ్రరాజ్యం
వాస్తవానికి గత వారం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా, అమెరికా ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలను కలిగి ఉన్నాయని అన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ విషయంలో చైనా అమెరికాను సమం చేస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీకాలంలో చైనాతో అణ్వాయుధ తగ్గింపు ప్రణాళికపై చర్చలు జరపడంలో విఫలమయ్యారు.

Nuclear Weapons Growing Concerns in Asia - Trump s Focus on India Pakistan and China

అణ్వాయుధాలను తగ్గించుకున్న 9 దేశాలు
స్వీడిష్ థింక్ ట్యాంక్ 'SIPRI'(సిప్రీ) 2024 నివేదిక ప్రకారం.. తొమ్మిది అణ్వాయుధాలు అధికంగా ఉన్న దేశాలు - అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా,ఇజ్రాయెల్ కాగా.. ఈ దేశాలు తమ అణ్వాయుధ నిల్వలను నిరంతరం ఆధునీకరిస్తున్నాయి. ఈ 9 దేశాలు కలిగి ఉన్న మొత్తం అణ్వాయుధాల సంఖ్య 2023లో 12,512 నుంచి సుమారు 12,121కి తగ్గింది.

భారత్, పాక్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి?
స్వీడిష్ థింక్ ట్యాంక్ సిప్రీ నివేదిక ప్రకారం, భారతదేశంలో 172 అణ్వాయుధ వార్‌హెడ్‌లు ఉండగా, పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధ వార్‌హెడ్‌లు ఉన్నాయి. అంటే పాక్ కంటే భారత్ లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. అదే సమయంలో భారత్ దీర్ఘ-శ్రేణి ఆయుధాలను, అంటే చైనా వరకు మోహరించడంపై దృష్టి సారిస్తోంది.

22 శాతం పెరిగిన చైనా అణ్వాయుధాలు
భారత్, పాక్ లకు పొరుగు దేశం, ప్రపంచంలో మూడో అతిపెద్ద అణుశక్తి అయిన చైనాలో చైనాలో అణ్వాయుధాల సంఖ్య 410 వార్‌హెడ్‌ల నుంచి 500కి 22 శాతం పెరిగింది. 2030 నాటికి చైనా వద్ద 1,000 అణ్వాయుధాలు ఉంటాయని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది.

అమెరికా, రష్యా ఎన్ని అణ్వాయుధాలను తొలగించాయి?
SIPRI నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధ నిల్వలో 90 శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి. రష్యా, అమెరికా మొత్తంగా తమ నిల్వల నుండి దాదాపు 2,500 వాడుకలో లేని అణ్వాయుధాలను తొలగించాయి. వాటిని నెమ్మదిగా నాశనం చేస్తున్నారు. 1986లో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య 70,000గా ఉండగా, ఇప్పుడు అది తగ్గింది.

అణు కార్యక్రమాన్ని ముగించిన మొదటి దేశం దక్షిణాఫ్రికా
1991లో దక్షిణాఫ్రికా తన అణు కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ముగించిన మొదటి దేశంగా అవతరించింది. 1994లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్, బెలారస్,కజకిస్తాన్ తమ అణు కార్యక్రమాలను నిలిపివేసాయి. ప్రతిగా వారికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా నుంచి భద్రతా హామీలు ఇవ్వబడ్డాయి. ఈ కాలంలో, అణ్వాయుధాల వాడకాన్ని నివారించడానికి, అణ్వాయుధ రహిత జోన్‌ను సృష్టించడానికి అనేక ఒప్పందాలు కుదిరాయి.

అమెరికా, రష్యా మళ్లీ ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని ఎందుకు బహిష్కరించాయి?
జులై 2017లో 100 కంటే ఎక్కువ దేశాలు అణ్వాయుధాలను పూర్తిగా నిషేధించాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రపంచం అణ్వాయుధాల రహితంగా మారడానికి దగ్గరగా వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా, ప్రధాన అణ్వస్త్ర శక్తులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ ఒప్పందాన్ని బహిష్కరించాయి.

ముందుగా అమెరికా చర్య తీసుకోవాలని చెబుతోన్న చైనా
అణ్వాయుధాలపై చర్చలు జరిగితే, అమెరికా, రష్యా మొదట తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యపై స్పష్టమైన పరిమితిని తీసుకురావాలనేది చైనా ప్రభుత్వం మొదటి నుంచి ఆ వైఖరినే కొనసాగిస్తోంది. ఈ విషయంలో అమెరికా ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తోందని చైనా చెబుతోంది. ముందుగా అమెరికా చర్యలు తీసుకుని ఆ తర్వాత మిగిలిన దేశాలకు సూచనలు ఇవ్వాలని చెప్పకనే చెప్తోంది.

ట్రంప్ రోనాల్డ్ రీగన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా?
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వల్ల ఏర్పడే ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించడం రిపబ్లికన్ పార్టీ సంప్రదాయమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఇటీవలి సంభాషణ సందర్భంగా అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా రష్యా నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్‌ను అణ్వాయుధాల సంఖ్యను తగ్గించాలని కోరారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్న అమెరికా-రష్యా ఒప్పందం
అమెరికా , రష్యా దేశాల మధ్య 'కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం' ఫిబ్రవరి 2026లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల సంఖ్యను పెంచకుండా లేదా వాటిని తగ్గించడానికి చర్చలు ప్రారంభించవచ్చు. అణ్వాయుధాలపై పరిమితులను కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాలని నిపుణులు అంటున్నారు ఎందుకంటే అలాంటి ఒప్పందం ఉద్రిక్తతలను తగ్గించగలదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+