రేప్‌లకు నిరసనగా జర్మన్ యువతి నగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ 31 రాత్రి జరిగిన అత్యాచారాలతో జర్మనీ అట్టుడుకుతోంది. నూతన సంవత్సరం వేడుకల వేళ జర్మనీలోని కోలోగ్నీ నగరంలో ఐరోపా దేశాల మహిళలపై శరణార్థులు మూకుమ్మడి అత్యాచారాలు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ‘ఆ మహిళలంతా సెక్స్ కోసమే ఆ రాత్రి బయటకు వచ్చారు' అని ఓ విదేశీ పత్రిక వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది.
అంతేకాదు ఈ మూకుమ్మడి రేప్‌లపై ప్రభుత్వ స్పందన కూడా జర్మనీ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తోంది. ఈ నేపథ్యంలో కోలోగ్ని నగరం రేప్‌లకు వేదికగా మారిందని, మిలోమూర్ అనే యువతి నగ్నంగా తన నిరసనను తెలియజేసింది. ‘మమ్మల్ని గౌరవించండి. మేం ఎగ్జిబిషన్‌లో దొరికే బొమ్మలం కాదు. మేం నగ్నంగా ఉన్నా కూడా మమ్మల్ని సాటి మనుషుల్లాగానే చూడండి' అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కోలోగ్ని నగర వీధుల్లో నగ్నంగా తిరిగింది.
‘ఓ మహిళగా తాను ఎలా ఉండాలో నిర్దేశించే హక్కు ఎవరికీ లేదు. నచ్చినట్టు బతికే హాక్కు నాకుంది. స్వేచ్ఛ, స్వాతంత్యం అనేది పురుషులకే కాదు, మహిళలకు ఉంటుంది. అర్థరాత్రి బయటకు వచ్చారని, నగ్నంగా నిలబడ్డారని వారిని మనుషులు కాదనుకోకండి. ఈ ప్రపంచంలో మహిళకు సరిహద్దులు నిర్ణయించే హక్కు మగవారికి ఉంటుందా?' అని ఆమె ప్రశ్నించింది.

వివరాల్లోకి వెళితే డిసెంబర్ 31 రాత్రి జర్మనీలో దాదాపు 150 మంది మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయి. ఫిన్లాండ్ రాజధాని నగరం హెల్‌సింకీలో తాజాగా 50 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆస్ట్రియా, స్వీడన్ దేశాల్లో కూడా పాతిక సంఖ్యలోనే రేప్ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
దాంతో స్త్రీలు రాత్రిపూట ఇంటి నుంచి వీధుల్లోకి రాకూడదని, సమస్యాత్మక ప్రాంతాలు అసలే వెళ్లరాదని, క్లబ్బులూ పబ్బులూ అంటూ తిరగరాదని ఫిన్లాండ్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 95 శాతం మంది శరణార్థులే. కాగా, బాధిత మహిళలంతా స్థానికులు కావడం విశేషం.
శరణార్థుల్లో 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని యూరప్ దేశాల అధికారులు చెబుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన జరిగిన మూకుమ్మడి అత్యాచారాల సంఘటనల్లో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications