ఫేస్‌బుక్‌లో మహిళా సైనికుల న్యూడ్ ఫోటోలు: అమెరికన్ నేవిలో కలకలం..

నేవి అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి. సదరు మహిళా అధికారిణుల వివరాలతో సహా నగ్న చిత్రాలను పోస్టు చేయడంతో అధికారులు సత్వరం ఫేస్ బుక్ పేజీని మూసివేశారు.

న్యూయార్క్: అమెరికా నేవీలో నగ్న ఫోటోల కలకలం రేగింది. నేవిలో పనిచేస్తోన్న మహిళా సైనికుల నగ్న చిత్రాలు ఏకంగా ఫేస్ బుక్ లోకి ఎక్కడంతో.. దీని వెనుక కొంతమంది మిలటరీ అధికారుల హస్తం ఉండవచ్చునన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నేవి అధికారిక ఫేస్ బుక్ పేజీలోఈ నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి. సదరు మహిళా సైనికుల వివరాలతో సహా నగ్న చిత్రాలను పోస్టు చేయడంతో అధికారులు సత్వరం ఫేస్ బుక్ పేజీని మూసివేశారు. చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయి మహిళా ఉద్యోగల ఫోటోలు లీకైన వాటిల్లో ఉన్నాయని చెబుతున్నారు.

అయితే దీనికి సంబంధించి నేవీ క్రైమ్ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నేవీ అధికార ప్రతినిధి ఒకరు మాత్రం దీని వెనుక కుట్ర చేసిందెవరో తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Nude photos of female navy officers leaked in us probe ordered

కాగా, నేవికి సంబంధించిన ఫేస్ బుక్ పేజీలో 30వేల మంది సభ్యులు ఉన్నారు. ఇందులోనే గుర్తు తెలియని వ్యక్తులు సదరు సైనికుల నగ్న చిత్రాలు పోస్టు చేశారు. వారి వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న విభాగాలతో సహా ఇందులో పోస్టు చేశారు. ఘటనపై అమెరికా నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+