ఇదెక్కడి బ్యాంకురా బాబు: ఈ బ్యాంకులో లోన్ పొందాలంటే నగ్న చిత్రాలు ష్యూరిటీగా పెట్టాలట..!

సాధారణంగా బ్యాంకుల నుంచి లోన్ పొందాలంటే అందుకు తగిన డాక్యుమెంట్లతో పాటు ఏదైనా మీ పేరున ఉన్న ఆస్తులు పూచీకత్తుగా పెట్టాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లను, ఆస్తులను పరిశీలించిన మీదట బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఇది బ్యాంకుల పద్దతి. అయితే చైనాలో మాత్రం ఓ సంస్థ ఆన్‌లైన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఇదేంటి ఆన్‌లైన్ ద్వారా లోన్‌లు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందికదూ... వీటికి గ్యారెంటీగా కస్టమర్లు ఏ డాక్యుమెంట్స్ సమర్పిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

రుణం పొందాలంటే నగ్న ఫోటోలు గ్యారెంటీ కింద పెట్టాలి

రుణం పొందాలంటే నగ్న ఫోటోలు గ్యారెంటీ కింద పెట్టాలి

చైనాలోని 'నేకెడ్ లోన్' అనే సంస్థ ఆన్‌లైన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఇక్కడ మహిళలకు మాత్రమే లోన్లు ఇస్తారు. అది కూడా ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేస్తారు. అయితే ఈ సంస్థకు ష్యూరిటీ ఏమి ఇవ్వాలో తెలుసా... మహిళా కస్టమర్లకు సంబంధించిన ఆర్థిక వివరాలు కాదు... వారి నగ్న శరీరమే వారి రుణాలు మంజూరుకు ష్యూరిటీ. అవును మీరు చదివింది నిజమే. ఈ మధ్యే 10 జీబీ సైజ్ ఉన్న మహిళల నగ్న ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అక్కడ నేకెడ్ లోన్ సంస్థ నుంచి రుణాలు పొందేందుకు మహిళలు తాము నగ్నంగా దిగిన ఫోటోలు వీడియోలను ఆన్‌లైన్‌లో పంపి అదే ఆన్‌లైన్ ద్వారా రుణాలు పొందారు.

సెల్ఫీ వీడియోలో పేరు వివరాలు చెప్పాల్సి ఉంటుంది

సెల్ఫీ వీడియోలో పేరు వివరాలు చెప్పాల్సి ఉంటుంది

నేకెడ్ లోన్ సంస్థ నుంచి రుణం పొందాలంటే ఎలాంటి ఆస్తులు, డాక్యుమెంట్లను ఆసంస్థ అడుగదు. కేవలం మహిళ యొక్క నగ్న ఫోటోలు మాత్రమే గ్యారెంటీ కోసం తీసుకుంటుంది ఆ సంస్థ. ఈ సంస్థ నుంచి రుణాలు పొందేందుకు మహిళలు తమ ఐడీ కార్డులను పట్టుకుని నగ్నంగా నిల్చొని సెల్ఫీలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అలా నగ్నంగానే నిల్చొని రుణాలు పొందగోరే మహిళలు తమ పేరు, కావాల్సిన డబ్బు, తిరిగి ఎప్పుడు చెల్లిస్తారు, చెల్లించకుంటే పరిణామాలను ఎదుర్కొంటామని చెప్పడంతో పాటు ఇతర వివరాలు చెబుతూ వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉంటే సంస్థ వారి నగ్న చిత్రాలను వీడియోలను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తామని బెదిరిస్తారు. ఒకవేళ వారు చెల్లించలేని స్థితిలో ఉంటే యాజమాన్యానికి లైంగిక కోరికలు తీర్చి రుణాలు కట్టకుండా తప్పించుకుంటారు.

నేకెడ్ లోన్ సంస్థ గుట్టును రట్టు చేసిన జీదైబౌ కంపెనీ

నేకెడ్ లోన్ సంస్థ గుట్టును రట్టు చేసిన జీదైబౌ కంపెనీ

ఇక ఈ ఫోటోలను జీదైబౌ అనే మరో ఆన్‌లైన్ సంస్థ లీక్ చేసింది. మొత్తం 161 మంది మహిళలు నేకెడ్‌లోన్ సంస్థ నుంచి రుణం పొందినట్లు ఈ సంస్థ వెల్లడించింది. వీరంతా 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లలోపు ఉన్నవారే అని పేర్కొంది. ఇందులో ఎక్కువగా ఉన్నది కాలేజీ విద్యార్థులే అని ఆ సంస్థ వెల్లడించింది. వెంటనే చైనా ప్రముఖ సోషల్ మీడియా వెబోలో జీదైబౌ సంస్థ ఓ పోస్టును పెట్టింది. నేకెడ్ లోన్ సంస్థ ఆగడాల గురించి త్వరలో బయటపెడతామని హెచ్చరించింది. నేకెడ్ సంస్థ నుంచి రుణాలు పొందినవారిలో ఎక్కువగా కాలేజీ విద్యార్థులే ఉన్నారు. వీరంతా వారి కాస్మెటిక్స్ కోసం ఇతరత్ర అవసరాలకోసమే తమ దేహాన్ని పణంగా పెట్టి లోన్ పొందిఉంటారనే అనుమానాలు నెటిజెన్లు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+