ఆ ఇంజెక్షన్‌తో నర్సులు అలా కనిపించారు: ఇమ్రాన్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కరాచీ: "ఆ డాక్టరు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారో కానీ ఆ మెడిసిన్ శరీరంలోకి దిగగానే నా చుట్టూ ఉన్న నర్సులు దేవకన్యల్లా కనిపించారు". ఈ మాటలు అన్నది ఎవరని అనుకుంటున్నారా... ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు తను ఆరోగ్యపరంగా ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించారు. అలా వివరిస్తున్న సమయంలోనే ఆయన నోరు జారారు.

నర్సులు దేవకన్యలా కనిపించారు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి నోరు జారారు. ఒకానొక సమయంలో తీవ్ర గాయాలైయ్యాయని ప్రధాని చెప్పారు. ఆ సమయంలో తన ఎముకలు విరిగినట్లు చెప్పారు. హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయినట్టు చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. తనకు నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇంజెక్షన్‌ ఇవ్వగానే నొప్పి అస్సలు తెలియలేదని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... ఆ వెంటనే తన చుట్టూ ఉన్న నర్సులు అతనికి దేవకన్యలా కనిపించారని చెప్పుకొచ్చారు. వారు అలా ముందు నిలబడితే నొప్పి అస్సలు అనిపించేది కాదని పరోక్షంగా వారి అందం గురించి ప్రధాని పొగిడారు.

2013 ఎన్నికల ప్రచారంలో కూలిన స్టేజ్

2013 ఎన్నికల ప్రచారంలో కూలిన స్టేజ్

2013 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ స్టేజ్‌పై ఉండి ప్రసంగిస్తుండగా స్టేజ్ కూలిపోయినప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ను తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హుటాహుటిన అతన్ని షౌకత్ ఖానుమ్ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. డాక్టర్ అసీమ్ తనకు ముందుగా ఓ ఇంజెక్షన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఇమ్రాన్ ఖాన్. అప్పుడు నొప్పి తగ్గాక నర్సులు గురించి ఇమ్రాన్ ఖాన్ చెప్పగానే అక్కడున్న వారు చప్పట్లు కొట్టారు. ఇంజెక్షన్ శరీరంలోకి దిగగానే తన నొప్పితో పాటు తాను ఏమి మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా పోయిందని చెప్పారు. ఇక ఇంజెక్షన్ పని చేయడం ఆపేశాక నొప్పి తిరిగబెట్టిందని చెప్పారు.

వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టు

ఇమ్రాన్ ఖాన్ నర్సులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న వీడియోను నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఒక్క ఇంజెక్షన్‌తో ప్రధానికి నర్సులు దేవకన్యలా కనింపించారంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే నైలా ఇనాయత్ తొలి భాగం ఉన్న వీడియోను మాత్రమే పోస్టు చేయగా మరో వ్యక్తి రెండో భాగంను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందులో ఇంజెక్షన్ ఇవ్వగానే లోకాన్నే మరిచి పోయి తన ముందు ఉన్న నర్సులను ఆకాశానికెత్తేసిన ఇమ్రాన్‌ఖాన్.. ఇంకో ఇంజెక్షన్ ఇవ్వాల్సిందిగా డాక్టర్లను బెదిరించినట్లుగా చెబుతున్నట్లు ఉంది. ట్విటర్‌లో పలువురు పలు రకాలుగా కామెంట్ చేశారు. నర్సు వృత్తి ఎంతో పవిత్రమైనదని కొందరు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఇమ్రాన్‌ఖాన్‌కు ఏదైనా సాధ్యమే అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+