ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలను బెదిరిస్తోంది: చైనాపై ఒబామా
జమైకా: దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లోని చిన్న దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. పనామాలో జరుగుతున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు జమైకా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
తన ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోందని బరాక్ ఒబామా చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగాన్ని తనదిగా చైనా క్లెయిమ్ చేస్తోందని అన్నారు. తనదిగా చెప్పుకుంటున్న ప్రాంతం ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌ల పరిధిలోకి చొచ్చుకెళ్తోందని ఆయన మండిపడ్డారు. దీని వల్ల భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా కృత్రిమంగా దీపాన్ని తయారు చేస్తోందని, దాన్ని ఆయుధాగారంగా మార్చుతోందని అన్నారు. అంతర్జాతీయ నిబంధనలను చైనా తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. ఆర్థిక, అంగ బలంతో పెత్తనం చెలాయించాలనుకుంటోందని అన్నారు.
అయితే ఈ సమస్యను ద్వైపాక్షికంగా చర్చలు జరుపుకుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా, ఇప్పటికే చైనా దేశ వ్యవహార శైలి పట్ల పలుదేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications