Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మతంపై బరాక్ ఒబామా వ్యాఖ్యలు: బాధపెట్టారని జిమ్ జిల్మోర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు ఐసిస్, క్రిస్టియన్ మతం పైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యల పైన విమర్శలు వినిపిస్తున్నాయి. మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదని, క్రైస్తవంలోనూ ఉందని, క్రూసేడులు, ఇంక్విజిషన్‌ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు.

వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో జరిగిన నేషనల్‌ ప్రేయర్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రసంగించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వీటిపై పలువురు మండిపడుతున్నారు.

ఉదయం అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు.. తాను ఇంతకుముందు ఏ అధ్యక్షుడి నుండి వినలేదని మాజీ రిపబ్లికన్ గవర్నర్ ఆఫ్ వర్జీనియా జిమ్ జిల్మోర్ అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా అమెరికాను, క్రిస్టియన్లకు మనస్తాపం కలిగించారని అభిప్రాయపడ్డారు.

కాగా, గురువారం వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో జరిగిన నేషనల్‌ ప్రేయర్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బరాక్ ఒబామా ప్రసంగించారు.
మతంపై విశ్వాసం ప్రజలతో మంచి చేయిస్తుందని, అదే సమయంలో అదో ఆయుధంలా మారుతుందని అభిప్రాయపడ్డారు. మత అసహనం ఏ ఒక్క మతానికో, జాతికో చెందినది మాత్రమే కాదని, అందరిలోనూ ఉందన్నారు.

 Obama criticized for remarks on ISIS, Christianity

మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదన్నారు. క్రైస్తవంలోనూ ఉందని వ్యాఖ్యానించారు. క్రూసేడులు, ఇంక్విజిషన్‌ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు. మతం మంచికే అయినా కొందరు తాము చేసే ఘాతుకాల కోసం మతాన్ని హైజాక్‌ చేస్తారన్నారు.

ఈ మత అసహనం మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం కోసం యుద్ధం చేస్తున్నామనుకుంటున్న ఐఎస్ఐఎస్ నిజానికి ఇస్లాంను మోసం చేస్తోందన్నారు. ఈ సభకు హాజరైన టిబెట్‌ మత గురువు దలైలామాను ఒబామా.. మంచి స్నేహితుడుగా అభివర్ణించారు.

భారత్ పైనా... భారత దేశంలో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భారత్‌లో అన్ని రకాల మత విశ్వాసాలు ఎదుర్కొన్న అసహన చర్యలను గాంధీ చూసి ఉంటే జీర్ణించుకోకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.

ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సభలో మత సహనంపై తాను చేసిన వ్యాఖ్యలు అధికార భారతీయ జనతా పార్టీని ఉద్దేశించినవేననే విమర్శలు కొన్ని భారత రాజకీయ పార్టీలు చేశాయి. దీనికి వైట్ హౌస్ రెండు రోజుల క్రితం స్పందించింది. ఒబామా చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి కాదని పేర్కొంది. అనంతరం ఒబామా మరుసటి రోజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+