ఐసిస్‌పై యుద్ధానికి అమెరికా యత్నం: ఒబామా వ్యూహమా?
వాషింగ్టన్: అమెరికా మరో యుద్ధానికి తెర తీస్తోంది! తన పాలన చివరి దశలో ఉన్న ఒబామా వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. 2002లో అమెరికన్ కాంగ్రెస్ ఇరాక్‌పై యుద్ధానికి అనుమతినిచ్చిన సందర్భంలో సెనెటర్‌గా దాన్ని వ్యతిరేకించి అమెరికా అధ్యక్షపీఠాన్ని అలంకరించిన ఒబామా అధికారాంతమున తానే యుద్ధానికి తహతహలాడుతున్నారు.
అందులో భాగంగానే ఇరాక్, సిరియాల్లో పట్టణాలను, గ్రామాలను ఆక్రమించుకుని చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై సైన్యాన్ని ప్రయోగించడానికి అనుమతిని కోరుతూ ముసాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్‌కు పంపారు.
ఐఎస్‌పై సైనిక చర్య తీర్మానానికి ఆమోదం తెలుపడం ద్వారా ఈ విషయంలో మనందరం ఐకమత్యంగా ఉన్నామని ప్రపంచానికి చాటాలని నేను కాంగ్రెస్‌కు పిలుపునిస్తున్నానని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో ఇరాక్, సిరియాలకే మధ్యప్రాచ్యానికి, మిగతా ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది కాబట్టి వారిని అణచివేసేందుకు భౌగోళికంగా హద్దులు లేని యుద్ధానికి కోరలూ కొమ్ములూ తొడిగే ఆ తీర్మానాన్ని ఆమోదించాలని ఆయన కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.

తన ప్రకటనలో ఒబామా.. ఐఎస్ మిలిటెంట్లను తుడిచిపెట్టడానికి మూడేళ్ల పాటు మధ్య ప్రాచ్యంలో ఐఎస్‌పై యుద్ధానికి(మిలిటరీ చర్యలు) అనుమతి కోరారు. అయితే.. ఇది అఫ్ఘానిస్థాన్ లేదా గతంలో ఇరాక్‌లో ఉన్నట్లు అమెరికన్ పదాతి దళాలు భారీగా ఇరాక్‌లో ఉండవని ఆయన అన్నారు.
ఇప్పటికే ఐఎస్ నాయకత్వాన్ని గగనతల దాడులు దెబ్బతీశాయని దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి సమయం పడుతుందని ఒబామా తన ప్రకటనలో వివరించారు.
ముసాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్‌కు పంపాక, దానిపై ఒబామా మాట్లాడారు. ఇరాక్, సిరియాల్లో పలు కిరాతక చర్యలకు పాల్పడుతున్న ఐఎస్ వల్ల మధ్య ప్రాచ్యానికే కాక ప్రపంచం మొత్తానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. వారిని అలాగే వదిలేస్తే ఆ ప్రమాదం అమెరికా భూభాగానికి రావడానికి ఎంతో కాలం పట్టదని హెచ్చరించారు.
ఆ పరిస్థితి రాకుండానే ఇరాక్, సిరియా దళాలకు అమెరికా మిలిటరీపరంగా సాయం చేయాలని చెప్పారు. కేవలం మూడేళ్ల కాలానికి అనుమతిని కోరిన ఒబామా.. ఈ చట్టంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం తన వారసుడికి ఇచ్చారు.












Click it and Unblock the Notifications