బ్రిటన్ ప్రధాని కామెరూన్‌గా పొరబడ్డ ఒబామా! ట్విట్టర్‌లో ఫాలో..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా పొరబడ్డారు! ఓ సాధారణ వ్యక్తికి ట్విట్టర్‌లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తిని మరో దేశ అధినేతగా భావించిన ఒబామా ఆయనను ఫాలో అయ్యారు. డేవిడ్ కామెరూన్ అనే వీడియో గేమ్ అభిమాని ట్విట్టర్ ఖాతాను చూసిన ఒబామా.. అతను బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌గా భావించి పొరబడ్డారట. బరాక్ ఒబామా ఫాలోవర్స్ ట్విట్టర్లో 6,45,000 మంది ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం డేవిడ్ కామెరూన్‌ను ఒబామా ప్రశంసించిన విషయం తెలిసిందే. డేవిడ్ కామెరూన్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అతను ప్రపంచంలోనే తనకు చాలా సన్నిహితమైన, నమ్మదగిన ఫ్రెండ్ అన్నారు. తాము ఎదుర్కొనే ప్రతి సవాల్‌ను.. ఇద్దరం కూడా ఒకేవిధంగా చూస్తామన్నారు.
గర్భ నిరోధక మాత్రలతో మహిళలకు ముప్పే!

మహిళలు గర్భ నిరోధక మాత్రలు తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని బ్రిటన్ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏ విధంగా వాడినా ముప్పు తప్పదని వారంటున్నారు. ఇలాంటి పిల్స్‌వాడిన మహిళలపై అధ్యయనం చేసిన ఒడెన్సీ యూనివర్శిటీ హాస్పటల్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ శాస్తవ్రేత్తలు ఈ హెచ్చరిక చేశారు.
కేన్సర్ సంబంధిత రుగ్మతలు సంభవిస్తాయని రీసెర్చి టీమ్ లీడర్ డాక్టర్ డేవిడ్ గైస్ట్ స్పష్టం చేశారు. వయసును బట్టి ప్రభావం చూపుతుందన్న ఆయన కొందరు మహిళల్లో మాత్రం ఇలాంటి ముప్పు తగ్గుతున్న విషయాన్ని తెలిపారు. 2000-2009 సంవత్సరానికి సంబంధించి డెన్మార్క్ ఆసుపత్రిలో పిల్స్ వాడిన 15 నుంచి 49 ఏళ్ల మహిళల డేటాను పరిశీలించిన శాస్తవ్రేత్తలు ఈ మేరకు నిర్థారించారు.












Click it and Unblock the Notifications