జపాన్‌కు ఫోన్ చేసి ‘సారీ’ చెప్పిన బరాక్ ఒబామా
న్యూయార్క్/టోక్యో: జపాన్ నేతలపై అమెరికా గూఢచర్యం జరిపినట్లుగా వికీలీక్స్ పలు పత్రాలను బహిర్గతం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్‌కు క్షమాపణలు చెప్పారు. బుధవారం జపాన్ ప్రధాని షింజో అబేతో ఒబామా ఫోన్లో మాట్లాడారని జపాన్ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై, చైనా కరెన్సీ ప్రభావంపై ఇరు దేశాలూ కలసి పోరాడాలని నేతలు నిర్ణయించారని సుగా వివరించారు. ‘వికీలీక్స్ కథనం తరువాత జపాన్‌లో నెలకొన్న చర్చ, ప్రజల మనోభావాలు దెబ్బతినడంపై అధ్యక్షుడు ఒబామా క్షమించాలని కోరారు' అని ఆయన చెప్పారు.

‘ఇదే సమయంలో గూఢచర్యం తీవ్రమైనదని షింజో అబే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ తరహా వార్తలు ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన అన్నారు' అని సుగా వెల్లడించారు.
అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంవత్సరాలుగా జపాన్ అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలపై గూఢచర్యం చేస్తోందని జులై నెలలో వికీలీక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్‌తో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో బరాక్ ఒబామా క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications