వైట్‌హౌస్ ఆవల ఓ రోజు: వీధుల్లోకి బరాక్ ఒబామా, ఏం చేశారు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీధులలో నడిచి షాపింగ్ చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు చాలా అందమైన రోజు అన్నారు. శ్వేతసౌధంలో ఉండే ఒబామా హాయిగా వీధుల్లో నడిచారు. వైట్ హౌస్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. గత ఏడాది కూడా ఇలాగే చేశారు.
మధ్యాహ్నం పూట ఒబామా ఒంటరిగా వీధుల్లోకి వచ్చారు. రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడున్న వారిని పలకరించారు. రోడ్డు పక్కన కూర్చున్న చిన్నారులతో ముచ్చటించారు. 22 డిగ్రీల సెల్సియెస్ ఉష్ణోగ్రత ఉండగా, తెల్ల చొక్కా, నలుపు టైతో ఆయన బయటకు వచ్చారు.

శ్వేతసౌధం వాయువ్య గేటు నుండి నేషనల్ టీచర్ ఆఫ్ ది ఇయర్ షానా పీప్లెస్‌తో కలిసి ఆయన బయటకు వచ్చారు. నడక మొదలు పెట్టి, శ్వేతసౌధం వీధిని దాటి హెచ్ స్ట్రీట్ వచ్చారు. ఆసియా టీయిజం దగ్గర ఆగారు. ఇది ఆ వీధిలో అందరికి తెలిసిన ప్రముఖ దుకాణం.
అక్కడి వారిని పలకరించారు. కాస్త నడవాలనుకున్నానని, ఇవాళ బాగుందని చెప్పారు. ఆ తర్వాత ఓ దుకాణం లోపలకు వెళ్లి ఏడు నిమిషాల పాటు గడిపారు. ఓ షాపింగ్ బ్యాగ్‌ను, టీ కప్‌ను తీసుకొని బయటకు వచ్చారు.ఆ తర్వాత వైట్ హౌస్ లోపలకు వెళ్లారు.












Click it and Unblock the Notifications