అమెరికా చరిత్రలో ఒబామా చెత్త ప్రెసిడెంట్: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో సారి అమెరికా అధ్యక్షుడు ఒబామాను టార్గెట్ చేసుకుని విమర్శించారు. అమెరికా చరిత్రలోనే ఒబామా లాంటి చెత్త ప్రెసిడెంట్ ను తాను చూడలేదని విరుచుకుపడ్డారు.

ట్రంప్ ఓ ఇంటర్వూలో ఈ విధంగా ఒబామా మీద నొటికొచ్చినట్లు అక్కసు వెళ్లగక్కారు. ఒబామా అధ్యక్ష పదవికే పనికిరాడని, అతను ఓ భయంకర విపత్తులాంటి వ్యక్తి అంటూ విమర్శించారు. ఇలాంటి భయంకరమైన అమెరికా అధ్యక్షుడిని తాను చూడలేదని చెప్పారు.

Obama will go down as worst president in US: Trump

ఒబామా వెంటనే అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికా అధ్యక్ష పదవికి పనికిరాడని గత వారం ఒబామా ట్రంప్ మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఓ బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఇంటర్వూలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒబామాను తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమో అని ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ట్రంప్ డెమొక్రెటిక్ అభ్యర్థి హిల్లరీని దెయ్యంతో పోల్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+