వాషింగ్టన్ వెళ్లి ఒబామా తలను పేల్చేవాడ్ని: అరెస్టైన ఐఎస్ అనుమానిత ఉగ్రవాది
వాషింగ్టన్: తనను ఎఫ్‌బిఐ అరెస్ట్ చేయకపోయుంటే తాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలను పేల్చేసేవాడ్ని అని ఐఎస్ అనుమానిత ఉగ్రవాది చెప్పాడు. ఐఎస్ ఉగ్రవాదిగా అనుమానించిన అమెరికన్ ఎఫ్‌బిఐ సదరు అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. అతడు ఓ మీడియా ఛానలో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.
గత జనవరిలో ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాది క్రిస్టోఫర్ లీ కార్నెల్()20ని ఎఫ్‌బిఐ అధికారులు అరెస్ట్ చేశారు. సిన్సినాటీలోని ఫాక్స్ 19టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్నెల్ భయాందోళనలకు గురిచేసే వ్యాఖ్యలు చేశాడు.

ఒకవేళ నీవు అరెస్ట్ కాకుంటే ఏం చేసేవాడివని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘నా తుపాకీతో ఒబామా తలను పేల్చేవాడిని. అంతేగాక, సెనెట్‌పై, ప్రజాప్రతినిధులపై సాధ్యమైనన్ని ఎక్కువ బుల్లెట్లు కురిపించడమే తన లక్ష్యం' అని ఐఎస్ అనుమానితుడు కార్నెల్ తెలిపాడు. అమెరికాలోని ఇజ్రాయిల్ ఎంబసీపై దాడి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు నిందితుడు అంగీకరించాడు.
తాను ఐఎస్ ఉగ్రవాద గ్రూపు సంస్థకు మద్దతుగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, పైప్ బాంబులను ఎలా తయారు చేయాలో కార్నెల్ నేర్చుకున్నాడని, ఒక తుపాకీని, మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేశాడని ఎఫ్‌బిఐ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications