షాక్: కత్తితో బెదిరించి యువకుడిపై మహిళ అత్యాచారం
అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి కత్తితో బెదిరింపులకు గురిచేసి ఓ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఓహియోకు చెందిన బ్రిటనీ కార్టర్ అనే 23 ఏళ్ల యువతిని పోలీసులు .
ఓహియో: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి కత్తితో బెదిరింపులకు గురిచేసి ఓ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఓహియోకు చెందిన బ్రిటనీ కార్టర్ అనే 23 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమెకు సహకరించిన కోరి జాక్సన్ అనే 20ఏళ్ల యువకుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. బ్రిటనీ, జాక్సన్‌లు పురుష డ్రైవర్ నడుపుతున్న టాక్సీలో ఎక్కారు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత 29ఏళ్ల వయసున్న డ్రైవర్‌పై వీరిద్దరూ దాడికి పాల్పడ్డారు. కత్తితో బెదిరింపులకు గురిచేసిన బ్రిటనీ కార్టర్... కారు డ్రైవర్‌పై అత్యాచారం పాల్పడింది.

అత్యాచారం జరుగుతున్న సమయంలో కారులోనే ఉన్న యువకుడు జాక్సన్.. డ్రైవర్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. అంతేగాక, డ్రైవర్ వద్ద ఉన్న రూ. 2000ను దొంగిలించాడు. ఆ తర్వాత డ్రైవర్‌పై రెండోసారి అత్యాచారానికి పాల్పడింది ఆ యువతి.
జనవరి నెల 28న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న కార్టర్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. 2016లో హెరాయిన్ అక్రమరవాణాకు సంబంధించి రెండు కేసులు నమోదవడమే కాకుండా ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉంది. దీంతో డ్రగ్స్ కేసులో నిందితురాలు, పురుషుడిపై అత్యాచారం కేసులో రూ.38 లక్షల వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. యువకుడిపై అత్యాచారానికి సహకారం, దొంగతనం కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications