పూల్ గేమ్‌ను తిలకించేందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్.. ఆదమరిస్తే ప్రాణాలు పోయేవి..!
బ్రిస్బేన్‌లో కొందరు పూల్ గేమ్ ఆడుతుండగా మరో ఆటగాడు అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అయితే ఆ ఆటగాడు ఆట ఆడేందుకు రాలేదు.. ఆట వీక్షించేందుకు వచ్చినట్లుగా కనిపించాడు. కానీ ఈ ఆటగాడిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఆ ఆటగాడెవరో తెలుసా..?
బ్రిస్బేన్‌లో కొందరు స్నేహితులు పూల్‌గేమ్ ఆడుతున్నారు. వారు ఆడుతున్న సమయంలో పూల్ టేబుల్ కింద నుంచి ఏదో చప్పుడు. పూల్ బాల్ వెళ్లి ఆ రంద్రంలో పడినప్పుడు తిరిగి పైకి వస్తోంది. దీంతో ఏంటా అని వారంతా ఆ రంద్రం వైపు చూశారు. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూల్ టేబుల్‌కు ఉన్నరంద్రం కింద పెద్ద పాము ఒకటి సేద తీరింది. ఇది చూసిన స్నేహితులు భయంతో కేకలు వేశారు.

పామును పూల్ టేబుల్ కింద చూడగానే పాములు పట్టే వాడికి ఫోన్ చేశారు. పాములు పట్టేవాడు వచ్చి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. పూల్ టేబుల్‌కు ఉన్న రంద్రంలో బాల్‌కోసం చేయి పెట్టే ముందు ఒకసారి చెక్ చేయాలని పాములు పట్టే అతను సూచించాడు. ఇక పాము టేబుల్ కింద ముడుచుకుని సేదతీరడాన్ని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. చాలామంది జంతు ప్రేమికులు పాము ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్ చేయగా మరికొందరు మాత్రం చాలా భయంకరంగా ఉందంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కొన్ని గంటలకే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒకేసారి 3900 షేర్లు రాగా... 2300 మంది కామెంట్ చేశారు.
ఈ పైథాన్ కార్పెట్ పైథాన్ అని ఎలైట్ స్నేక్ క్యాచర్స్ సంస్థ పేర్కొంది. ఇవి రెండు నుంచి 4 అడుగులు పొడవు ఉంటాయని తెలిపారు. ఇవి ఇంట్లో తిరిగే పిల్లులను, కుక్కలను చంపుకు తింటాయని చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications