నమాజ్ చేయలేదని పెళ్లైన 5రోజులకే విడాకులిచ్చింది!
రియాద్: నమాజ్ చేయడం లేదని కారణంగా ఓ ముస్లిం మహిళ వివాహమైన ఐదో రోజే భర్తకు విడాకులిచ్చేసింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళకు ఇటీవల వివాహమైంది.
కాగా, భర్త ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఐదు పూటలా నమాజ్ చేయడంలేదని, అందుకని తనకి విడాకులు కావాలని పెళ్లైన ఐదోరోజునే ఆమె కోర్టుకు దరఖాస్తు చేసుకుంది.

ఆమె పిటిషన్‌ను అంగీకరించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భర్తకు 55,000 సౌదీ రియాల్ చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
ఇస్లామిక్ చట్టాలను ఆచరించడంలో సౌదీ ముందుంటుందనే విషయం తెలిసిందే. అలాంటి దేశంలో ఈ ఘటన జరగడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరి కొందరు ఇంత చిన్న విషయానికే విడాకులా అంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications