‘పారదర్శకత లేదు: త్వరలో ‘వాట్సప్’పై నిషేధం’
లండన్: మెసేజింగ్ యాప్ వాట్సప్ చిక్కుల్లో పడింది. ఈ మెసేజింగ్ యాప్‌ను త్వరలోనే నిషేధించేందుకు బ్రిటన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత లోపించిందనే కారణంతో వాట్సప్ యాప్‌పై బ్రిటన్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది.
‘ది ఎక్స్‌ప్రెస్ యూకె' కథనం ప్రకారం.. ప్రధాని డేవిడ్ కెమెరూన్ ఇప్పటికే వాట్సప్, ఐమెసేజ్, స్నాప్చట్ లాంటి మెసేజింగ్ యాప్‌లపై నిషేధం విధించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ లాంటి యాప్‌లలో పారదర్శకత లోపించిందని ప్రధాని కెమెరూన్ అభిప్రాయపడ్డారు. వాట్సప్, ఇతరా మెసేజింగ్ యాప్స్ గుప్తీకరించిన సమాచారాన్ని చదవలేకపోతున్నాయని, అందువల్లే ఈ యాప్స్‌పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కొన్ని వారాల్లోనే వాట్సప్, ఐమెసేజ్, స్నాప్చట్ యాప్‌లపై బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపాయి. ‘ది డెయిలీ' కథనం ప్రకారం.. ‘ఈ వివాదాస్పద చట్టం అమలైతే.. మరో రెండు మూడు వారాల్లో ఈ మూడు మెసేజింగ్ యాప్‌లు బ్రిటన్‌లో కనిపించవు' అని పేర్కొంది.
మెసేజింగ్ యాప్‌ల నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications