మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమ్రికాన్.. స్పుత్నిక్‌తో చెక్
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకూ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వేరియంట్ కరోనా టీకాలు వేసుకున్న వారిని కూడా వదలడం లేదు. రెండు డోసులే కాదు మూడు డోసులు వేసుకున్న వారిని సైతం వదల బొమ్మాలి అంటుంది. తాజాగా న్యూయార్ నుంచి ముంబై వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది.

ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు.. అయినా వదలని ఒమిక్రాన్
ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఈనెల 9న ముంబై వచ్చినట్లు అధికారులు తెలిపారు . 29 ఏళ్ల ఆ యువకుడికి విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోన పరీక్షల్లో పాటిజివ్ తేలింది. అనంతరం అతని నమూనాలను ఇతర పరీక్షలకు పంపగా ఒమిక్రాన్ వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. అయితే ఆ యువకుడిలో ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. ఆ యువకుడు ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలో 40కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ సోకిన బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా వైరస్ సోకిన అతడితో కాంట్రాక్ట్ లో ఉన్న ఇద్దరికీ పరీక్షలు నిర్వహించారు. వారిద్దరికీ మాత్రం నెగెటివ్ గా వచ్చింది. ఈకేసుతో ముంబాయిలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 15కి చేరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కేసులు సంఖ్య 40కి చేరింది.

మహమ్మారికి భరించాల్సిందే..
కరోనా నుంచి బయట పడేందుకు రెండు, మూడు డోసులు వేసుకున్నా రీ ఇన్పెఓన్ అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి మళ్లీ సోకకుండా టీకాలు వేసుకున్నా నిలువరించలేవని పేర్కొంటున్నారు. అయితే ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి పెద్దగా లక్షణాలు ఉండడంలేదని.. తీవ్రత తక్కువేనని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచాన్నిఈ మహమ్మారి ఇప్పట్లో విడిచిపెట్టదని దీనిని భరించాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకపోతే ప్రమాదం పొంచి ఉందని హెచ్చిస్తున్నారు.

స్పుత్నిక్ వీతో ఒమిక్రాన్ కు చెక్ -రష్యా
రెండు, మూడు డోసులు తీసుకున్నా ఒమిక్రాన్ సోకడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కు విరుగుడుగా స్పుత్నిక్ వీ సమర్థవంతంగా పనిచేస్తోందని రష్యా ప్రకటించింది. బూస్టర్ డోస్ గా స్పుత్నిక్ లైన్ ను తీసుకుకోవడంతో ఒమిక్రాన్ అణిచివయవచ్చని తెలిపింది. ఒమిక్రాన్ సోకినా తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఇది రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. ఇది మిగతా వాక్సిన్లతో పోల్చితే ఏడు రేట్లు ఆదికంగా పనిచేస్తోంది వెల్లడించింది.












Click it and Unblock the Notifications