77 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. డబ్యూహెచ్‌వో హెచ్చరికలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లతో పోల్చితే ఈ కొత్త రకం వేరియంట్ అసాధారణ రీతిలో వ్యాప్తిచెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 77 దేశాలకుపైగా వ్యాపించిన ఒమిక్రాన్ త్వరలోనే మరిన్ని దేశాలకు వ్యాంపించే అవకాశం ఉందని డబ్యూహెచ్‌వో హెచ్చరించింది. ఈ వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
Recommended Video

కఠిన ఆంక్షలతో కట్టడి
గతంలో వచ్చిన డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఈ ఒమిక్రాన్ చాలా తొందరగా వ్యాప్తిచెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ వెల్లడించారు. దీనిపై ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కొత్త వేరియంట్ తొలుత వెలుగు చూసిన దక్షిణాప్రికాలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి నెలకొందని WHO వెల్లడించింది. ఇటీవల అమెరికాలో ఈ కొత్త ఒమిక్రాన్ విజృంభిస్తోంది. అక్కక ఉన్న కేసుల్లో మూడు శాతం ఈ కొత్తరకం కేసులే ఉన్నాయని తెలిపింది. అటు యూరప్‌లో కూడా హస్పెటల్స్‌లో చేరే రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది.. తాజాగా ఈ ఒమిక్రాన్‌తో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమైయ్యాయి. కఠిన ఆంక్షలు విధించాయి.

నిర్లక్షం వహిస్తే భారీ మూల్యం తప్పదు..
అయితే దీనిని స్వల్ప వ్యాధి కింద పరిగణలోకి తీసుకోవద్దని డబ్యూహెచ్‌వో నిపుణుడు బ్రూస్ అయిల్ వార్డ్ అన్నారు. ఈ వైరస్‌ను నిర్లక్షంగా తీసుకుంటే వీపరీతమైన పరిణామాలు, ప్రమాదకర పరిస్థితులు ఎదురైయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. వ్యాక్సిన్స్ వేయించుకున్నామని నిర్లక్షం వహించకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం వంటి జాగ్రత్తలు వహించాలని కోరింది. కేసుల సంఖ్య పెరిగితే దాని ప్రభావం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని డుబ్యూహెచ్‌వో హెచ్చరించింది.. తమ పౌరులకు బూస్టర్ డోస్ ఇవ్వడంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలని సూచించింది.

13 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 13 వేలకు దాటాయని తెలిపింది . భారత్‌లో కూడా రోజు రోజుకూ ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే 77 దేశాలకు ఈ మహామ్మారి వేరియంట్ వ్యాప్తి చెందింది. అసాధారణ రీతిలో కేసులు నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ డేంజర్ వేరియంట్ కట్టడికి ప్రయత్నించాలని కోరింది.












Click it and Unblock the Notifications