‘బ్లూమూన్’: జులైలో రెండు చందమామలు
న్యూఢిల్లీ: జూలై నెలలో రెండు చందమామలు దర్శనమివ్వనున్నాయి. సాధరణంగా ప్రతీనెలలో మనం ఒక చంద్రున్ని చూస్తుంటాం. కానీ ఈ జూలై నెలలో మనం రెండు చంద్రుళ్లను చూడబోతున్నాం.
జులై 1న పున్నమి చంద్రుడిని చూశాం. మళ్లీ జూలై 31న రెండో చంద్రున్ని చూడబోతున్నాం. భౌగోళిక పరిభాషలో ఈ దృగ్విషయాన్ని ‘బ్లూమూన్' అని పరిగణిస్తారు. ఒకే నెలలో రెండు పున్నమిలు వచ్చినపుడు ఇలా పేర్కొంటారు.

ప్రతీ మూడు సంవత్సరాలకు ఓసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకుముందు 2012, జులైలో రెండు చందమామలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరంలో జులైలో రెండు చందమామలు దర్శనమివ్వనున్నాయి.
మళ్లీ ఈ బ్లూ మూన్ అంటే రెండు చందమామలను 2018లో చూడనున్నాం.












Click it and Unblock the Notifications