ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..

లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తమ అప్పులు తీర్చడానికి, జీవితాన్ని వెళ్లదీయడానికి పలువురు విద్యార్థులు తమ శరీరాన్ని అమ్ముకుంటున్నారు. స్వన్వీయా విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు తమ జీవితాన్ని వెళ్లదీయడానికి వ్యభిచారం కూపంలోకి దిగుతున్నారని నివేదిక పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం తెలియకుండానే ఈ కూపంలోకి నెట్టబడుతున్నారని తెలిపింది. విచిత్రమేంటంటే.. అమ్మాయిలకంటే ఎక్కువగా అబ్బాయిలే ఈ కూపంలో దిగుతున్నారు.

 One in 20 students sell their bodies for sex to pay for university, according to survey

లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం 6,750 విద్యార్థులపై చేపట్టిన ఆన్‌లైన్ సర్వేలో 5శాతం మంది పురుషులు, 3.5 శాతం అమ్మాయిలు వ్యభిచార కూపంలో పనిచేస్తున్నారని పేర్కొంది. విద్యార్థుల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ పని చేస్తుండగా.. మరి కొంత మంది తాము చదువుతున్న కోర్సులకు కావాల్సిన డబ్బుల కోసం వ్యభిచారకూపంలోకి నెట్టబడుతున్నారని సర్వే వెల్లడించింది.

అలాగే ప్రతీ ఐదుగురిలో ముగ్గురు ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఈ కూపంలోకి వెళుతున్నారని స్వాన్సియా యూనివర్సిటీ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న ట్రేసీ సాగర్ వెల్లడించారు. వ్యభిచారం కూపంలోకి దిగుతున్న విద్యార్థుల సంఖ్య వేలాలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కుటుంబసభ్యులకు, సమాజానికి భయపడి ఈ విషయాన్ని బయటపడకుండా చూసుకుంటున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+