న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరి మృతి

One killed, four injured in apartment fire at Trump Tower in New York

న్యూయార్క్: న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన టవర్. టవర్‌లోని 50వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రంప్ టవర్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అగ్నికీలల్లో చిక్కుకున్న ట్రంప్ టవర్ ఫోటోను న్యూయార్క్ నగర అగ్నిమాపక శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

మంటలను అదుపు చేసినట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ టవర్ ప్రమాదం నుంచి బయటపడిందని, అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేశారని, వారికి థ్యాంక్స్ అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+