దారుణం: గొడవ వద్దన్నందుకు కారుతో ఢీకొట్టి చంపేశారు
బీజింగ్: దక్షిణ చైనాలోని చెన్ చియాంగ్డ్‌లో ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపాడు. రోడ్డుపై జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై నిందితుడు కారుతో ఢీకొట్టి చంపేశాడు.
నిందితుడు తన ఇంటి పక్కనే ఉండే మహిళతో కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. అది మనసులో పెట్టుకుని ఆమెపై అతను పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం టాక్సీలో వెళ్తున్న మహిళను నడిరోడ్డుపై అడ్డగించి వివాదానికి దిగాడు. ఆమె ఓవైపు వాదిస్తుండగానే మధ్యలో ఓ యువకుడు కలుగజేసుకుని సర్దిచెప్పే యత్నం చేశాడు. ఇంతలో నిందితుడు జువాన్ లింగ్జి కారుతో ఆమెను ఢీకొట్టాడు.

ఊహించని పరిణామానికి అక్కడున్నవారంతా షాక్‌కి గురయ్యారు. అంతా తేరుకునేలోపే ఎనిమిది సార్లు కారుతో అతన్ని ఢీకొట్టాడు.నిందితుడి కారుకి, టాక్సీకి మధ్య నలిగిపోయి ఆ యువకుడు కుప్పకూలిపోయాడు.
పక్కనే ఉన్న కొందరు అతన్ని రక్షించేందుకు యత్నించగా.. వారికి కూడా గాయాలయ్యాయి. ఈ నేరంలో నిందితుడు జువాన్ లింగ్జి(26)కు ముగ్గురు వ్యక్తులు సాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో నుంచి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications