మహిళా నేత ఛాతిపై మోచేయి వేసి నెట్టిన ప్రధాని!
ఒట్టావా: పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా నేత పైన కెనడా ప్రదాని జస్టిస్ ట్రూడ్ దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. పార్లమెంటులోని మహిళా నాయకురాలిని ఆయన నెట్టివేశారని, ఆమె పైన చేయి చేసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రధాని ట్రూట్ తన ఛాతి పైన మోచేతితో వెనక్కి నెట్టేశాడని, ఇది అత్యంత హేయనీయమని బాధిత మహిళ నేత ఆరోపించారు. మహిళా నాయకురాలి ఛాతిని తాకడం, మోచేతీతో నెట్టివేసి ఇంత దారుణంగా ప్రవర్తించడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.

ప్రధాని ట్రూడ్ చర్యతో తాను తొలుత ఆశ్చర్యపోయానని, వెంటనే తేరుకొని పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయానని చెప్పారు. ప్రధాని దురుసు ప్రవర్తన కారణంగా తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని ఆమె వివరించారు. హౌస్ ఆఫ్ కామన్స్ సీసీ ఫుటేజీ పరిశీలించి చూడగా.. అందులో ప్రధాని ప్రతిపక్ష నేతల పైన దాడికి దిగినట్లు ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications