యాపిల్ ఆర్డర్ చేస్తే ఐ ఫోన్ వచ్చింది.. షాక్ తిన్న కస్టమర్
ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన వస్తువుకు బదులు వేరేది వస్తే చాలు కోపం నశలానికి ఎక్కుతుంది. ఇక నకిలీది అయితే చెప్పక్కర్లేదు. ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో కలిగే అసహనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికీ ఈ ఫీలింగ్ తెలుసు. మరి ఆర్డర్ ఇచ్చిన దానికంటే విలువైన వస్తువు చేతిలో పడితే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ బ్రిటన్ వ్యక్తికి ఎదురైంది.
ట్వికెన్‌హామ్‌కు చెందిన నిక్ జేమ్స్ ఆపిల్ పళ్లు కావాలంటూ స్థానిక సూపర్ మార్కెట్ టెస్కోలో ఇటీవల ఆర్డరిచ్చాడు. కొన్ని రోజుల తరువాత తను ఆర్డరిచ్చింది వచ్చినట్టు ఫోన్ రావడంతో టెస్కోకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది నిక్ ముందు ఓ బ్యాగ్ పెడుతూ మీకో సర్‌ప్రైజ్ ఉందన్నారు. నిక్ ఏమీ పెద్దగా సంబరపడిపోలేదు. చిన్న బహుమతి ఏదో ఉండి ఉంటుందిలే అనుకుంటూ కాస్తంత అనాసక్తిగా బ్యాగ్ తెరిచాడు. అందులో ఉన్న గిఫ్ట్ ఏంటో తెలిసే సరికి..జాక్ పాట్ కొట్టేశానని అర్థమై ఎగిరి గంతేశాడు.

ఆపిల్ పళ్లు ఆర్డర్ చేస్తే ఏకంగా యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ వచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధి లేకుండా పోయింది. టెస్కో కంపెనీ తన వినియోగదారుల కోసం ఇటీవల ఓ ప్రోత్సాహకర ఆఫర్ ప్రకటించింది. ఆపిల్, శాంసంగ్ వంటి ఖరీదైన గాడ్జెట్స్‌ను తన వినియోగదారులకు ఉచితంగా ఇస్తోంది. ఈ ఆఫర్ ఎప్రిల్ 18 వరకూ కొనసాగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో నిక్ జేమ్స్ అదృష్టం పండి ఐఫోన్ చేతిలో పడింది.



Click it and Unblock the Notifications
