వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేయసి హత్య కేసులో పిస్టోరియస్ దోషే

By Pratap
|
Google Oneindia TeluguNews

బ్లోమ్‌పోంటిన్: గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌ను దక్షిణాప్రికా సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. పిస్టోరియస్‌కు సంబంధించిన కేసుపై వచ్చిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండడంతో ఈ కేసుపై పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి.

గృహ నిర్బంధం కింద శిక్షాకాలాన్ని పూర్తి చేయాడనికి నిందితుడికి తగిన శిక్ష విధించాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దక్షిణాప్రికా న్యాయమూర్తి తొకోజైల్ మసిపా బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఉద్దేశ్యపూర్వకంగానే దుర్బుద్ధితో గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్‌ను పిస్టోరియస్ హత్య చేశాడని న్యాయమూర్తి జస్సిస్ ఎరిక్ లీచ్ మీడియాకు తెలిపారు.

Oscar Pistorius convicted of murdering girlfriend Reeva Steenkamp

ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం పిస్టోరియస్‌ను దోషిగా తేలుస్తూ తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు ఈ కేసను తప్పి పంపించింది. బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ 2013 ఫిబ్రవరి 14వ తేదీన ప్రిటోరియాలోని తన నివాసంలో తన ప్రేయసి రీవా స్టీన్ కాంప్‌ను దారుణంగా కాల్చి చంపాడు.

ఎవరో ఆగంతకులు ప్రవేశించారనే ఉద్దేశంతో తాను పిస్టల్‌తో కాల్పులు జరిపానని, తాను రీవా స్టీన్ కాంప్ అనుకోలేదని, తన తప్పుడు అభిప్రాయం వల్లనే కాల్పుల్లో ఆమె మరణించిందని పిస్టోరియస్ చెప్పాడు. ఐదేళ్ల జైలు శిక్ష పడిన పిస్టోరియస్ ఏడాది పాటు జైలులో ఉండి అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలయ్యాడు.

English summary
Oscar Pistorius was convicted of murder on Thursday by South Africa's Supreme Court of Appeal, which threw out his earlier conviction on the lesser crime of culpable homicide for killing his girlfriend Reeva Steenkamp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X