ప్రియురాల్ని చంపిన ప్రిస్టోరియస్‌కు మానసిక పరీక్షలు
ప్రిటోరియా: నిరుడు (2013) ప్రేమికుల దినోత్సవం రోజు తన ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపును కాల్చివేసిన బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ మానసిక పరిస్థితిని పరిశీలించాలని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. మంగళవారం దక్షిణాఫ్రికాలో గల కోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. పిస్టోరియస్ ముప్పై రోజుల పాటు ఆసుపత్రికి హాజరు కావాలని సూచించారు.
న్యాయమూర్తి తొకజిలే మసిపా ఆదేశాలిస్తూ... పారాలింపియన్ స్ప్రింటర్ అస్కార్ పిస్టోరియస్ ప్రతి రోజు స్థానిక వెకోపీస్ సైకియాట్రిక్ ఆసుపత్రిలో అటెండ్ కావాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం వెళ్లి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే ఉంటాలని ఆదేశించారు.

కాగా, ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపును బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ గత ఏడాది కాల్చి చంపిన విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు వేకువజామునే పిస్టోరియస్ ఆమెను కాల్చి చంపాడు. ఆ రాత్రి అంతా ఆమెతో అతను వాగ్వాదానికి దిగాడనే విమర్శలు వచ్చాయి. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్ చేతిలో హత్యగావించబడింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications