గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

జోహన్నస్‌బర్గ్: తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తి తొకోజిలే మాసైపా మంగళవారం తీర్పు చెప్పారు.

ఆస్కార్ పిస్టోరియస్‌ను సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు అతడి ప్రేయసి రీవా స్టీన్‌క్యాంప్ హత్య కేసులో దోషిగా ప్రకటించింది. ఫలితంగా అతడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

ప్రణాళిక ప్రకారం హత్య చేశాడన్న కేసులో పిస్టోరియస్ నిర్దోషి అని అని అంతకుముందు ప్రకటించిన న్యాయస్థానం.. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి హత్య చేసినందుకు ఆ తర్వాత పిస్టోరియస్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఘటన జరిగిన సమయంలో పిస్టోరియస్ గన్ ఉపయోగించడంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కోర్టు పేర్కొంది.

పిస్టోరియస్ నిరుడు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి తన ప్రియురాలు రీవాను కాల్చి చంపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆమెను హత్య చేయలేదని, ఇంట్లోకి ఎవరో ఆగంతకులు చొరబడ్డారని భ్రమపడి జరిపిన కాల్పుల్లో ఆమె మృతి చెందిందని పిస్టోరియస్ చెప్పాడు.

కాగా, సెప్టెంబర్ నెలలో తన ప్రేయసి హత్య కేసులో న్యాయమూర్తి తీర్పు చదవడం ప్రారంభించిన సమయంలో బ్లేడ్ రన్నర్ ఆస్కార్ ప్రిస్టోరియస్ ఏడ్చేశాడు. డాక్‌లో కూర్చున్న పిస్టోరియస్ కంటతడి పెట్టడం కనిపించింది. నాడు న్యాయమూర్తి తీర్పు చదవడం ప్రారంభించారు.

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌‌ను న్యాయస్థానంలో హాజరుపర్చిన దృశ్యం.

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌‌ను న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం తీసుకు వెళ్తున్న పోలీసులు.

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌‌ న్యాయస్థానంలో ఆవేదనగా నిలుచుకున్న దృశ్యం.

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు

తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదిలా ఉండగా, ప్రేయసి రీవా స్టీన్ కాంప్‌ను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌పై మరో మాజీ ప్రేయసి తీవ్రమైన ఆరోపణలు చేసింది. పిస్టోరియస్ మాజీ ప్రేయసి సమంత టేలర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రీవా స్టీన్ కాంప్‌ను పొరపాటున కాల్చి చంపానని పిస్టోరియస్ అంటున్నప్పటికీ.. అతడు చాలా ప్రమాదకర వ్యక్తి' అని తెలిపింది.

అంతేగాక ‘రీవా కంటే ముందు నేను బలవాల్సింది. రీవా చనిపోయినప్పుడు చాలా మంది నేనే చనిపోయానని అనుకున్నారు. నా మృతికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు కూడా పంపారు' అని సమంతా టేలర్ పేర్కొంది. పిస్టోరియస్‌తో ఉన్నంత కాలం తాను భయపడుతూనే ఉన్నానని చెప్పింది.

అతను తనను అనుమానించేవాడని, తన జీవితంలో మరెవరైనా ఉండేవారేమో అని తరచుగా తన మొబైల్ ఫోన్ చూస్తుండేవాడని తెలిపింది. పిస్టోరియస్‌కు తుపాకీలంటే పిచ్చిన సమంతా టేలర్ చెప్పింది. అతడి దగ్గర ఎప్పుడూ తుపాకీలుండేవని తెలిపింది. రీవా హత్య కేసులో సమంతా టేలర్ కూడా కోర్టు విచారణలో సాక్ష్యం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+