వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ట్వీట్ చేయలేదు, ఆందోళనగా ఉంది: ఆస్కార్‌లో సెటైర్లు

అస్కార్ వేడుకల వేదిక పైన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన కనిపించింది. పలువురు సెలబ్రిటీలు బ్లూ రిబ్బన్ ధరించి వచ్చారు.

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: అస్కార్ వేడుకల వేదిక పైన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన కనిపించింది. పలువురు సెలబ్రిటీలు బ్లూ రిబ్బన్ ధరించి వచ్చారు.

<strong>కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..</strong>కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..

ఏడు ముస్లీం దేశాల ప్రజలను దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ వారు బ్లూ రిబ్బన్ ధరించి వచ్చారు. అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్ (ఏసీఎల్‌యూ)కు మద్దతిస్తూ వారు రిబ్బన్‌ ధరించారు.

సెలెబ్రిటీల వ్యతిరేకత

సెలెబ్రిటీల వ్యతిరేకత

ఐరిష్‌-ఇథోపియన్‌ స్టార్‌ రూత్‌ నెగ్గా, మూన్‌లైట్‌ సినిమా డైరెక్టర్‌ బెర్రీ జెంకిన్స్‌ సహా మరికొందరు ప్రముఖులు కెర్లీ క్లోస్‌, కాసీ అఫ్లెక్‌, మెంజ్‌ పాసెక్‌, లిన్‌-మానుయెల్‌ మిరిండా తదితరులు బ్లూ రిబ్బన్‌తో కనిపించారు.

జిమ్మీ కిమ్మెల్ వ్యతిరేకత

జిమ్మీ కిమ్మెల్ వ్యతిరేకత

ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ కూడా ట్రంప్ పైన తన వ్యతిరేకతను వేదిక పైన చూపించారు.

ట్రంప్‌కు చురకలు

ట్రంప్‌కు చురకలు

దాదాపు కార్యక్రమం ప్రారంభమై రెండు గంటలవుతోందని, ఆయన ఇంకా ఏం ట్వీట్‌ చేయలేదని, తనకు ఆందోళనగా ఉందంటూ ట్రంప్‌ తరచూ ట్వీట్లు చేసే అలవాటును గుర్తు చేస్తూ జిమ్మీ వ్యాఖ్యానించారు.

హే ట్రంప్..

హే ట్రంప్..

వేదికపై ఉండగానే మధ్యలో జిమ్మీ ఫోన్‌ తీసుకుని హే డొనాల్డ్‌ ట్రంప్‌ యు అప్‌? అని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రొడక్షన్‌ బృందాన్ని తన ఫోన్‌ స్క్రీన్‌ను అందరికీ కనిపించేలా చేయమని కోరారు. దీంతో జిమ్మీ ఫోన్‌లో ట్వీట్‌ స్క్రీన్‌పై అందరికీ కనిపించింది. దీంతో చాలా మంది గట్టిగా నవ్వారు.

మెరిల్ స్ట్రీప్

మెరిల్ స్ట్రీప్

అలాగే ట్రంప్‌ పాలసీలను వ్యతిరేకించిన నటి మెరిల్‌ స్ట్రీప్‌ను గతంలో ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. మెరిల్‌కు మద్దతుగా జిమ్మీ మెరిల్‌ సేస్‌ హాయ్ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్వీట్‌ చేశారు. జిమ్మీ ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేశారు.

English summary
Renowned Hollywood celebrities like Barry Jenkins and Ruth Negga marked their protest against Donald Trump the US President's recent travel issue at the 89th Annual Oscar Awards Ceremony at the Dolby Theatre in Los Angeles, by sporting a blue ribbon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X