కెనడా పార్లమెంటుపై దాడి ఒక్కడే: దృశ్యాల విడుదల

ఒట్టావా: కెనడా పార్లమెంట్‌పై దాడి ఘటనలో పాల్గొన్నది ఒకే ఒక్క వ్యక్తి అని ఆ దేశ పోలీస్‌ విభాగం నిర్ధారించింది. పోలీస్‌ కాల్పుల్లో మరణించిన వ్యక్తిని జెహాఫ్‌ బెబూగా గుర్తించారు. జెహాఫ్‌గా గుర్తు పట్టగలిన వ్యక్తి ఒకరు కెనడా పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. అతని దాడిలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఉన్న సైనికుడు మరణించిన విషయం తెలిసిందే. సాయుధుడు ఆ సైనికుడిని హతమార్చిన తర్వాత పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించి 50 మార్లు కాల్పులు జరిపాడని అంటున్నారు. అతన్ని హౌస్ ఆఫ్ కామన్స్ సార్జంట్ ఎట్ ఆర్మ్సమ్ కెవిన్ వికర్స్ కాల్పి చంపాడు.

కెనడా రాజధాని ఒట్టావాలో దేశ పార్లమెంట్‌మీద దాడి చేసింది జెహాఫ్‌ బెబూ అనే 32 ఏళ్ల వ్యక్తి అని కెనడా పోలీసులు నిర్ధారించారు. జెహాఫ్‌ ఒంటరిగానే ఈ దాడికి తెగబడ్డాడని, ఇతరులకు ఎవరికీ ఈ దాడితో ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. దాడి దృశ్యాలను పోలీసులు అధికారికంగా విడుదల చేశారు. జెహాఫ్‌కు పెద్దగా నేర చరిత్ర లేదని పోలీసులు చెప్పారు.

Ottawa shootings: Terror strikes Canadian capital as attacks leave one soldier and one suspect dead

కొద్ది రోజుల క్రితం క్యూబెక్‌ నగరంలో ఇద్దరు సైనికులను కాల్చి చంపిన ఘటనతో జెహాఫ్‌కు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అతనికి కెనడాతోపాటు లిబియా పౌరసత్వం కూడా ఉండి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఐసిస్‌ ఉగ్రవాద భావాలకు ఆకర్షితుడు అవుతున్న మాట నిజమేనని పోలీసులు భావిస్తున్నారు.

అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడని, బహుశ సిరియా వెళ్లడానికి సిద్ధపడుతున్నాడని పోలీసులు వివరించారు. జెహాఫ్‌ గురించి తెలిసిన వ్యక్తి ఒకరు పోలీసులకు ఆయన వివరాలు తెలియజేశారు.

జెహాఫ్‌ వాంకోవర్‌ నగరానికి చెందిన వాడు. అతనికి మాదక ద్రవ్యాలు వాడే అలవాటు ఉండేది. మూడు నెలల క్రితమే ఆ అలవాటును అతను వదిలించుకున్నాడు. అయినా డ్రగ్స్‌ కోసం అప్పుడప్పుడు అవస్థ పడేవాడని ఆయన వివరించారు. జెహాఫ్‌ ఒంటరిగా దాడి చేసినా ఈ కేసు విచారణను ఆపేదిలేదని, కొనసాగిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ దాడికి అతనికి ఎవరనైనా మద్దతు ఇచ్చారా? లేక సాయం చేశారా? వంటి వివరాల కోసం పరిశోధన జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+