భార్య ముక్కు కోసిన భర్త: తాలిబన్ ఏరియాకు పరుగు
కాబూల్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆగ్రహంతో ఆమె ముక్కుకోసేశాడు. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘోర్మాక్ జిల్లాలో చోటుచేసుకున్నది. రక్తమోడుతున్న బాధితురాలి ఫొటోను స్థానికులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో భయపడిన భర్త తాలిబన్ల ఆధీనంలోనున్న ప్రాంతంలోకి పారిపోయాడు. మహమ్మద్ ఖాన్, రెజా గుల్ భార్యాభర్తలు. ఆదివారం రెజాతో గొడవపడిన ఖాన్ విచక్షణాజ్ఞానం కోల్పోయి చిన్నపాటి కత్తితో రెజా ముక్కు కోసేశాడు. దీంతో ఆమె అరుపులు విన్న స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

భర్త మొహమ్మద్ ఖాన్ జేబులోని కత్తితో భార్య రేజా గుల్ ముక్కు కోసేశాడని అధికార వర్గాలు చెపపాయి. ఆ విధమైన కిరాతక, దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని మహిళా కార్యకర్తలు అంటున్నారు.
మొహమ్మద్ ఖాన్ తన భార్య ముక్కు కోసేయడానికి గల కారణమేమిటనేది తెలియదు. వారిద్దరికి ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఓ చిన్నారి కూడా ఉంది. నిరుద్యోగంతో బాధపడుతున్న ఖాన్ ఇటీవలే ఇరాన్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications