viral video: బీరు బాటిల్స్ పై గాంధీజీ చిత్రాలు.. ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ..

స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు మనకు తెలిసినవే. ఆయన మద్యపానానికి, జంతు హింస కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గాంధీజీని స్మరించుకుంటూ ఏటా ఆయన జన్మదినం, వర్ధంతి రోజున మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు మూసివేయటం ఆనవాయితీ.. అయితే తాజాగా ఓ వీడియో సామాజిక మధ్యమాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

బీరు బాటిల్స్ పై...

బీరు బాటిల్ పై గాంధీజీ ఫొటోలు ఉన్న పోస్టులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రష్యన్ బీరు బ్రాండ్ రివోర్ట్ బాటిల్ పై గాంధీజీ చిత్రాలు ఉన్నాయి. రష్యన్ బ్రాండ్ రివోర్ట్ హేజీ ఐపీఏ అనే బీర్ క్యాన్లపై గాంధీజీ ఫొటోలు, ఆటోగ్రాఫ్ కనపడడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేశాన్ని కించపరచడమే అవుతుందని మండిపడ్డారు. తక్షణం ఈ బ్రాండ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై జోక్యం చేసుకుని చిత్రాలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని శ్రీ సుపర్ణో సప్తతీ అనే సామాజిక కార్యకర్త.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని కోరారు.

Outrage on Social Media as Mahatma Gandhi s Picture Appears on Beer Cans

గతంలోనూ..

2018లోనూ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్న సమయంలో రష్యాలోని ఓ బార్ లో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరుతో ఉన్న బీర్ తాగుతూ కొందరు కనిపించారు. అంతకుముందు కూడా అమెరికాకు చెందిన ఓ కంపెనీ తమ బీర్ క్యాన్స్ మీద గాంధీజీ చిత్రాలు అతికించారు. ఈ ఘటనపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే ఈ ఘటనపై ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+