వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు వ్య‌తిరేకంగా.. సరిహద్దు గోడ వద్ద మెక్సిక‌న్ల ‘మాన‌వ‌హారం’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిహద్దు గోడ నిర్మాణ ప్రకటనకు వ్యతిరేకంగా మెక్సికోలో నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మెక్సికో ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొని సరిహద్దులో మానవ హారంగా నిలబడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియుడాడ్ జేరెజ్(మెక్సికో): అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో పెద్ద గోడ కట్టిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మెక్సికోలో నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మెక్సికో ప్రజలు ఆందోళనలో పాల్గొని సరిహద్దులో మానవ హారంగా నిలబడ్డారు.

సరిహద్దు నగరమైన సియుడాడ్ జేరెజ్ లో స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, పలు సంస్థలు ఒకచోటకు చేరి చేతుల్లో పూలు పట్టుకుని మానవహారం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సరిహద్దు అమెరికా నగరం ఎల్ పాసో, సియుడాడ్ జేరెజ్ ల మధ్య పెద్ద ఫెన్సింగ్ ఉంది.

Over 1,500 Mexicans Protest on US Border Against Trump's Wall Plan

ఈ ఫెన్సింగ్ వద్ద సుమారు 1.5 కిలోమీటర్ల మేర మానవ హారంగా నిలబడిన మెక్సికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోడ కట్టాలనేది అత్యంత చెత్త నిర్ణయమని.. దీనివల్ల వలసలు, శరణార్థులు, డ్రగ్ రాకెట్స్ ఏవీ ఆగవంటూ ఓ ఆందోళనకారుడు పేర్కొన్నాడు.

ఈ రెండు సరిహద్దు నగరాల్లో ప్రజలు ప్రతీరోజూ ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు, ఓ నగరంలో ఉంటూ మరో నగరంలో పని చేస్తుంటారు. ఆందోళనకారులు ఇలాంటి నిరసన ప్రదర్శనలు మెక్సికో పసిఫిక్ కోస్ట్ సరిహద్దులో, అమెరికా నగరం శాండిగో, మెక్సికో సిటీ టిజువానా మధ్యన కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
More than 1,500 Mexicans formed a "living wall" in the border town of Ciudad Juarez, which is separated by fencing from its US neighbor city El Paso, to protest against US President Donald Trump's plans to build a wall along the US-Mexico border, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X