మపీదులపై దాడులు......142 మంది దుర్మరణం

యోమెన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కిరాతకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. మానవబాంబుల రూపంలో అభం శుభం తెలియని 142 మందిని పొట్టన పెట్టుకున్నారు. 351 మంది గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

శుక్రవారం యోమెన్ రాజధాని సనాలోని మసీదులలో ముస్లిం సోదరులు నమాజ్ చెయ్యడానికి వెళ్లారు. దక్షిణ సనాలోని బద్ర్ మసీదు లోపల ఒక మానవ బాంబు పేలింది. ప్రాణాలు చేతిలో పెట్టుకుని బయటకు వస్తున్న సమయంలో అదే మసీదు గేటు దగ్గర ఇంకొక మానవ బాంబు పేలింది.

over 143 dead in suicide bombings at Houthi mosques in Sana

అల్- హశాహుష్ మసీదు లక్షంగా మరో మానవబాంబు పేలింది. హౌతి పౌర సైన్యానికి మద్దతుగా నిలస్తున్న ఉన్నాతాధికారి అబ్దెల్ హఫెద్ అల్-సక్కవ్ ఫై అదెన్ మీద గురువారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో హఫెద్ తప్పించుకున్నాడు. ఇదే దాడిలో నలుగురు దుర్మరణం చెందారు.

ఆత్మహుతి దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. షియాల్లోని హౌతి పౌర సైన్యం లక్షంగా ఈ దాడులు జరిగాయి. హౌతీలను పూర్తిగా అంతం చేసే వరకు తాము నిద్రపోమని, దాడులూ ఆత్మహుతి దాడులు చేస్తూనే ఉంటామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+