పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న... 500లకుపైగా భారతీయులు!
500 మందికిపైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో అధికశాతం మంది జాలర్లే ఉన్నారు. భారత ఖైదీల్లో చాలామంది అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి చేపల వేటకు వెళ్లిన వారే.
లాహోర్ : 500 మందికిపైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో అధికశాతం మంది జాలర్లే ఉన్నారు. 527 మంది భారతీయులు సహా మొత్తం 996 మంది విదేశీయులు వివిధ జైళ్లలో ఖైదీలుగా ఉన్నట్టు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది.
దేశంలోకి అక్రమ చొరబాటు, మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు, ఉగ్రవాదం తదితర నేరాల ఆరోపణల కింద వీరు ఖైదు చేయబడినట్టు తెలిపింది. భారత ఖైదీల్లో చాలామంది అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి చేపల వేటకు వెళ్లి అరెస్టయిన వారే.

అరేబియా సముద్రంలో సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించకపోవడం వల్ల తరచూ జాలర్లను అరెస్టు చేయడం, బోట్లను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. తమ జలాల్లో అక్రమంగా చేపలవేట కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ గత నెలలో 55 మంది భారత మత్య్సకారులను పాకిస్తాన్ సముద్రయాన రక్షణ సిబ్బంది అరెస్టుచేశారు.
పాక్ జైళ్లలో చైనా, సౌదీ జాతీయులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. అంతేకాదు, 100 దేశాల జైళ్లలో 9,476 మంది పాకిస్తాన్ జాతీయులు ఖైదు చేయబడ్డారని సోమవారం లాహోర్ హైకోర్టుకు ఆ దేశ విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. యూఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్‌దేశాల జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడిపించేందుకు చొరవ చూపాలని బాధిత కుటుంబాలు కోర్టుకు విజ్ఞప్తి చేశాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications