వ్యంగ్య ఫోటో, శివసేన ఆగ్రహం: సారీ చెప్పిన పాక్ నటి
కరాచీ: పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ ఓ ఫోటో విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. పాకిస్థాన్ నటీ నటులను బాలీవుడ్ సినిమాల్లో నటించనివ్వమని కొద్ది రోజుల క్రితం శివసేన హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
వీటిని దృష్టిలో పెట్టుకుని గత వారం ముంబైలో జరిగిన హాలోవీన్ పార్టీ సందర్భంగా పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ ఓ ఫోటో తీసుకుని ట్విట్టర్లో పెట్టింది. ఇది వివాదాస్పదమైంది. ఈ ఫోటోలో శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ఆహార్యాన్ని పోలినట్టు నుదుట తిలకం, మెళ్ళో రుద్రాక్షల దండలు, కాషాయ వస్త్రం ధరించిన పాకిస్థాన్ దర్శకుడు అసీజ్ రజా 'మహీరాకో బహర్ నికాలో' అనే ప్లకార్డు పట్టుకుని ఉంటాడు.

క్యాట్ ఉమన్ ఆహార్యంలో అతని భుజంపై చెయ్యివేసి మహీరా నవ్వుతూ ఉంటుంది. ఈ ఫోటోను మహీరా ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ ఫోటో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications