Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త వివాదంకు తెరతీసిన పాక్: కర్తాపూర్‌లో 1971 యుద్ధం నాటి బాంబు ప్రదర్శన

కర్తాపూర్ : భారత్‌ను చెడ్డచేసి చూపేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా పాకిస్తాన్ తన కడుపుమంటను బయటపెడుతోంది. సిక్కుల పవిత్ర పుణ్యస్థలం కర్తాపూర్ గురుద్వారా ముందు పాకిస్తాన్ అప్పుడెప్పుడో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ గురుద్వారపై ఓ బాంబు జారవిడిచిందని పేర్కొంటూ పాకిస్తాన్ ఆ బాంబును ఓ గ్లాస్ కేసులో గురుద్వార ముందు ప్రదర్శించింది. శనివారం అధికారికంగా కర్తాపూర్ కారిడార్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

1971లో జరిగిన యుద్ధం సందర్భంగా కర్తాపూర్ ఆలయంను ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో భారత్ బాంబుదాడి చేసిందని ఆ బాంబును ఓ గ్లాస్‌కేసులో ప్రదర్శిస్తూ పక్కనే ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. పోస్టర్‌లో ఇదంతా రాసి ఉంది. గురుద్వారాను ధ్వంసం చేయాలని భారత్ భావించినప్పటికీ అల్లాదయ వల్ల గురుద్వారాకు ఎలాంటి హాని కలగలేదని చెబుతూ భారత్‌లోని సిక్కులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ జారవిడిచిన ఈ బాంబు పక్కనే ఉన్న శ్రీఖూసాహిబ్ అనే పవిత్రమైన బావిలో పడి పేలలేదని పోస్టర్‌పై రాసుకొచ్చింది. ఈ బావి నుంచే సిక్కు మతగురువు గురునానక్ దేవ్ నీళ్లు తోడుకుని పొలాల్లో పంట పండించేవారని చెప్పుకొచ్చింది.

 Pak rakes up fresh controversy:Exhibits 1971 bomb in front of Kartapur Gurudwara

ఇదిలా ఉంటే పాక్ పాల్పడిన ఈ చర్యపై భారత్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్తాన్ భారత్‌లో నివసిస్తున్న సిక్కుల మనోభావాలను దెబ్బతీసి ఇతర మతాల వారిపైకి ఉసిగొల్పి మతకల్లోలం సృష్టించే కుట్రపన్నిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా పాకిస్తాన మరో వివాదానికి తెరతీసింది. కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ఓ పాటను విడుదల చేసింది పాకిస్తాన్. అందులోని ఓ పోస్టర్‌లో ఖలిస్తాన్ వేర్పాటు వాది ఫోటోను చూపించింది.ఈ చర్యను ఖండించిన భారత అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ చర్యను చూస్తే ఖలిస్తాన్ వేర్పాటు వాదులను పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం అర్థమవుతోంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+