షరీఫ్ మనవరాలి పెళ్లికి దావూద్ వచ్చాడా, మోడీకి తెలియదా?
లాహోర్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన అనంతరం ఆ తర్వాత రోజు భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం కూడా హాజరైనట్లుగా తెలుస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
దీనిపై భారత్ అధికారులు మాట్లాడుతూ... పాక్ ప్రధాని షరీఫ్.. దావూద్ ఇబ్రహీంను ఆహ్వానించినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ లాహోర్‌లో సర్ ప్రైజ్ విజిట్ చేసిన విషయం తెలిసిందే. లాహోర్‌లోని నవాజ్ షరీఫ్ పూర్వీకుల ఇంటికి వెళ్లి ప్రధాని మోడీ వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 26వ తేదీన దావూద్ ఇబ్రహీం కూడా నవాజ్ షరీఫ్ మనవరాలి విందులో పాల్గొన్నారని ఇంగ్లీష్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఐబీఎన్ 7లో బుధవారం వచ్చిన కథనం ప్రకారం.. దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా షరీఫ్ పూరవీకుల ఇంటికి వచ్చి విందుకు హాజరయ్యారు. వారందరికీ షరీఫ్ సకల మర్యాదలు చేశారు.
దావూద్ ఇబ్రహీంతో పాటు పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు బల్జీత్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కథనం వచ్చిందని అంటున్నారు. అయితే, ప్రధాని మోడీకి దావూద్ ఇబ్రహీం రాక గురించి తెలియదని కూడా పేర్కొంది.
డిప్లోమసీయా లేక ద్రోహమా?
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్... దావూద్ ఇబ్రహీంను ఆహ్వానించడం డిప్లోమసీయా లేక ద్రోహమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, అసలు దావూద్ ఇబ్రహీం వచ్చే వేడుకకు వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నాయి. దావూద్ ఇబ్రహీం అందరి కంట పడేలా వేడుకలకు వచ్చేందుకు ఐఎస్ఐ అంగీకరించదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా భారత్, ఇంటర్ పోల్ అతని కోసం గాలిస్తున్నందున అతను బహిరంగంగా కనిపించే అవకాశాలు లేవంటున్నారు.












Click it and Unblock the Notifications