Pak Vs NZ: చివరి నిమిషంలో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న న్యూజీలాండ్

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజీలాండ్ క్రికెట్ టీం చివరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది.
పాకిస్తాన్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు న్యూజీలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
భద్రతా కారణాలను చూపుతూ రావల్పిండి స్టేడియంలో అడుగుపెట్టడానికి న్యూజీలాండ్ జట్టు నిరాకరించింది.
ఈ స్టేడియంలోనే న్యూజీలాండ్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (శుక్రవారం) తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది.
https://twitter.com/BLACKCAPS/status/1438800002042802178
18 సంవత్సరాల తర్వాత న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడటానికి వచ్చింది. రావల్పిండిలో రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీని తర్వాత లాహోర్‌లో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది.
"పాకిస్తాన్లో పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, జట్టు భద్రతా సలహాదారులతో సంప్రదించిన తర్వాత, ఈ పర్యటనను కొనసాగించకూడదని జట్టు నిర్ణయించింది" అని న్యూజీలాండ్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
https://twitter.com/TheRealPCB/status/1438799448767881217
తనకు అందిన సలహా మేరకు ఈ పర్యటనను కొనసాగించడం సాధ్యం కాదని న్యూజీలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు.
"పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదొక ఎదురుదెబ్బ అని నేను అనుకుంటున్నాను. వారు అద్భుతమైన ఆతిథ్యమిచ్చారు. కానీ మేము ఆటగాళ్ల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం" అని ఆయన అన్నారు.
తమ జట్టును తిరిగి స్వదేశం రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యూజీలాండ్ తెలిపింది.
న్యూజీలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, వారి భద్రత కోసం మేమంతా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- INDvsENG ఐదో టెస్టు రద్దు: 'బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు’ - ఈసీబీ
అయితే, న్యూజీలాండ్ నిర్ణయం ఏకపక్షమని, నిరాశజనకమని పాకిస్తాన్ క్రికెట్ బ్రోర్డ్ అభివర్ణించింది.
https://twitter.com/babarazam258/status/1438814618898608130
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?
- 9/11: మూడు వేల మందిని చంపిన నిందితులపై 20 ఏళ్లు గడిచినా అమెరికా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- అఫ్గానిస్తాన్: కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
బల్లులు లేని దేశాలు ఇవే బ్రో.. ఎందుకో తెలుసా? -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications