కోరికతీర్చాలని మామ వేధింపులు, అత్తతో కలిసి ఆమె ఏం చేసిందంటే?
:కోడలిని లైంగికంగా వేధించినందుకు భర్తను తుపాకీతో కాల్చి చంపింది ఓ భార్య. తొలుత ఏదో గొడవ కారణంగానే భర్తను చంపినట్టు భావించినా పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగుచూశాయి.
పెషావర్:కోడలిని లైంగికంగా వేధించినందుకు భర్తను తుపాకీతో కాల్చి చంపింది ఓ భార్య. తొలుత ఏదో గొడవ కారణంగానే భర్తను చంపినట్టు భావించినా పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగుచూశాయి.
పాకిస్తాన్ లోని కైబర్ కనుమలలోని షాంగ్లా గుల్బర్ ఖాన్ తన భార్య బేగమ్ బిబితో నివాసం ఉంటున్నాడు. వీరి కొడుకు పాక్ ఆర్మీ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి భార్య అత్త మామల వద్దే ఉంటోంది.

అయితే కోడలిపై మామా ఖాన్ కన్నేశాడు. తొలుత తన భార్య, కొడుకు లేని సమయాల్లో ఆమెను లైంగికంగా వేధించేవాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురిచేసేవాడు.
గత మూడు నెలలుగా మామ వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్నిఆమె భర్తకు చెప్పింది.తండ్రిని ఏం చేయమంటావో చెప్పాలని తల్లి బేగమ్ ను కొడుకు అడిగాడు. కోడలితో అసభ్యంగా ప్రవర్తించకూడదని ఆమె పలుమార్లు భర్త ఖాన్ ను హెచ్చరించింది.
కొడుకు ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. కొడలిపై తన భర్త లైంగిక వేధింపులు మానడం లేదని బిబి ఆగ్రహించింది. అయితే అతను నిద్రపోతున్న సమయంలోనే కోడలితో కలిసి భర్తపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది.
ఈ విషయాలను ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. బేగమ్ తో పాటు కోడలిపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం కోర్టులో హజరుపర్చారు. కోర్టు వారికి జ్యూడిషియల్ కస్టడి విధించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications