ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్‌ది ఎనిమిదోస్థానం: రిపోర్ట్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓ ఇంటెలిజన్స్ మేధావి సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో ఇరాక్ దేశం మొదటిస్థానంలో ఉంది. ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది.
ఇంటెలిజన్స్ ఏజన్సీల కోసం పని చేసే వాషింగ్టన్‌కు చెందిన ఇంటెల్‌సెంటర్ అనే సంస్థ రూపొందించిన కంట్రీ థ్రెట్ ఇండెక్స్ (సిటిఎస్)లో ఉన్న మరో దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్. జాబితాలో అది నాలుగో స్థానంలో ఉంది.

ఆయా దేశాల్లో గత 30 రోజుల్లో ఉగ్రవాదులు, తిరుగబాటుదారులకు సంబంధించిన హెచ్చరికలు, మెస్సేజింగ్ ట్రాఫిక్, వీడియోలు, ఫోటోలు, సంఘటనలు, చనిపోయిన, గాయపడిన వారి సంఖ్య లాంటి వాటి ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న ఇతర దేశాల్లో నైజీరియా (2వ స్థానం), సోమాలియా (మూడు), యెమన్ (అయిదు) సిరియా (ఆరు), లిబియా (ఏడు) ఈజిప్టు (తొమ్మిది), కెన్యా (పది) ఉన్నాయి. జీరోకన్నా ఎక్కువ సిటిఐ ఉన్న దేశాలు జాబితాలో 45 ఉన్నాయి. ఈ దేశాల సగటు సిటిఐ 74 కాగా, ప్రపంచ సిటిఐ 3,313 ఉంది.












Click it and Unblock the Notifications